Share News

ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచాలి

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:31 PM

ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఆశ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు బాలమణి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచాలి
ఊట్కూర్‌లో వైద్యాధికారి సంతోషికి వినతిపత్రం అందిస్తున్న ఆశా కార్యకర్తలు

- వర్కర్ల డిమాండ్‌

- పీహెచ్‌సీల ముందు ధర్నా

నారాయణపేట/నారాయణపేట రూరల్‌/మక్తల్‌/ మాగనూరు/ధన్వాడ/ఊట్కూర్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఆశ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు బాలమణి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం నారాయణపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ప్లకార్డులు పట్టుకొని ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేతనాల అమలు కోసం ఆశా వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ స్థాయిలో ఆందోళనలు చేస్తున్నాయన్నారు. 45వ, 46వ ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ సిఫారసుల ప్రకారం పెన్షన్‌, సామాజిక భద్రత, ఇతరత్రా ప్రయోజనాలను ఆశా కార్యకర్తలకు కల్పించాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నర్సింహరావుకు సమర్పించారు. కార్యక్రమంలో భాగ్యమ్మ, రేణుక, పార్వతి, రాధిక, సునీత, అనురాధ, లలిత తదితరులున్నారు.

అదేవిధంగా, పేట మండలంలోని కోటకోండ ప్రభుత్వ ప్రాథమిక కేంద్రం ముందు ఆశా వర్కర్లు ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వైద్యాధికారి ప్రతిభకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. కార్య క్రమంలో నాగమణి, బాలనర్సమ్మ, నర్మద, అంజమ్మ, భాగ్యమ్మ, అనురాధ తదితరులున్నారు.

మక్తల్‌ మండలంలోని కర్ని పీహెచ్‌సీ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశాలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు గోవిందరాజు, కర్ని పీహెచ్‌సీ అధ్యక్షురాలు యశోద మాట్లాడారు. అనంతరం డాక్టర్‌ తిరుపతికి వినతిపత్రం అందించారు. ఆశా వర్కర్లు ఇందిర, అమీనాబేగం, అనిత, సు జాత, అనురాధ, సావిత్రమ్మ, రాజేశ్వరి, ఆశ, కళావతి, పుష్ప తదితరులున్నారు.

మాగనూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం ముందు ఆశా వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పుంజనూరు ఆంజనేయులు మాట్లాడారు. అనంతరం డాక్టర్‌ అప్రోజుపాషకు వినతిపత్రం అందించారు. ఆశా వర్కర్ల యూనియన్‌ జిల్లా కార్యదర్శి గౌరమ్మ, మండల అధ్యక్షులు శాంత మ్మ, సత్యమ్మ, రేణుక, సుగుణ, వెంకటమ్మ, అంజమ్మ, కృష్ణ, నాయకులు పాల్గొన్నారు.

ధన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం వైద్యాధికారిణికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆశ వర్కర్లు విజయలక్ష్మీ, చంద్రకళ, మాసమ్మ, లక్ష్మీ, అంజిలమణి, భాగ్య, నర్సింగమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఊట్కూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆశా వర్కర్లు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. త మ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వైద్యాధికారి సంతోషికి వినతిపత్రం అందించారు. ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, బాలమణి, ఆకాశవాణి, పద్మ, పుష్ప, సావిత్రమ్మ తదితరులున్నారు.

Updated Date - Mar 21 , 2025 | 11:31 PM