Share News

యువ చైతన్యంతోనే వికసిత్‌ భారత్‌ సాధ్యం

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:36 PM

యువతీయువకుల చైతన్యంతోనే వికసిత్‌ భా రత్‌ లక్ష్యం సాధ్యపడుతుందని ప్రిన్సిపాల్‌ డాక్ట ర్‌ షేక్‌ కలందర్‌బాషా అన్నారు.

యువ చైతన్యంతోనే వికసిత్‌ భారత్‌ సాధ్యం

ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ షేక్‌ కలందర్‌ బాషా

గద్వాల టౌన్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): యువతీయువకుల చైతన్యంతోనే వికసిత్‌ భా రత్‌ లక్ష్యం సాధ్యపడుతుందని ప్రిన్సిపాల్‌ డాక్ట ర్‌ షేక్‌ కలందర్‌బాషా అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత జనాభాలో యువ కులే సింహభాగం ఉండటం కలిసివచ్చిందన్నా రు. కేంద్ర ప్రభుత్వ యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో యువఉత్సవ్‌-2025 కార్యక్ర మంలో ఉల్లాసభరితంగా సాగింది. భాగస్వా ములైన వారికి, ప్రదర్శనల్లో ప్రతిభ కనబరిచిన వారికి మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్లు అనిల్‌గౌడ్‌, రాజేంద్ర కుమార్‌, కళాశాల అధ్యాపక బృందం ఉన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 11:36 PM