ట్రాఫిక్ సిబ్బందికి అధునాతన పరికరాలు
ABN , Publish Date - Mar 27 , 2025 | 10:49 PM
జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల ను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి అధునాతన పరికరాలను అందించామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.

- ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాల క్రైం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల ను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి అధునాతన పరికరాలను అందించామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఐరన్-బారికేడ్స్-10, రిఫ్లెక్ట్ జాకెట్స్-10, బ్రీత్ అనలైజర్-9, బొల్లార్డ్స్-50, బాటమ్స్-20, రేడియం టేప్ రోల ర్స్-25 పరికరాలను జిల్లా కేంద్రంలోని తన చాంబర్‌లో ట్రాఫిక్ ఎస్‌ఐ బాలచంద్రుడుకు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ గతంలో ఉన్న బ్రీత్ అనలైజర్ స్థానం లో, నాబ్‌లేకుండానే కేవలం బ్లో చేస్తే సెన్సార్‌తో మద్యం తాగారా లేదా నిర్ధారించవచ్చన్నారు. కార్యక్రమంలో కార్యాలయ ఏవో సతీష్‌కుమార్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.