అసెంబ్లీలో బిల్లుల ఆమోదం హర్షణీయం
ABN , Publish Date - Mar 19 , 2025 | 11:25 PM
బీసీ రిజర్వేషన్‌తో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లులకు అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం తెలిపినందుకు హర్షం వ్య క్తం చేస్తూ జిల్లాలో పలుచోట్ల కాంగ్రె స్ శ్రేణులు బుధవారం ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

- జిల్లాలో పలుచోట్ల సీఎం చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణుల క్షీరాభిషేకం
గట్టు, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్‌తో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లులకు అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం తెలిపినందుకు హర్షం వ్య క్తం చేస్తూ జిల్లాలో పలుచోట్ల కాంగ్రె స్ శ్రేణులు బుధవారం ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గట్టులోని బస్టాండ్ ఆవరణలో కాంగ్రె స్ నాయకులు రేవంత్‌రెడ్డి చిత్రపటా నికి పాలాభిషేకం చేశారు. నియోజక వర్గ ఇన్‌చార్జి సరితమ్మ ఆదేశాను సా రం ముఖ్యమంత్రితో పాటు తెలంగా ణ క్యాబినెట్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీజిల్లా ఉపాధ్యక్షుడు మాచర్ల వెం కటస్వామిగౌడ్, మండల అధ్యక్షుడు మహబూ బ్ పాష, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఎస్. కృష్ణ, బల్గెర క్రిష్ణారెడ్డి, క్రిష్ణయ్యగౌడ్, బాలకృష్ణనాయు డు, కుర్వ బజారి, వసంత్, హుస్సేన్, నల్లారెడ్డి, రఫి, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
ధరూరు : బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకర ణ బిల్లులకు ఆమోదం తెలుపుతూ అసెంబ్లీ స మావేశంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయ కుడు డీఆర్ శ్రీధర్ అన్నారు. రెండు బిల్లులు శాసనసభలో ఆమోదం పొందిన నేపథ్యంలో జ డ్పీ మాజీ చైర్‌పర్సన్, గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆ దేశాల మేరకు మండల కాం గ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ధరూరులో ని వైఎస్‌ఆర్ సర్కిల్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషే కం చేశారు. కార్యక్రమంలో పటేల్ శ్రీనివా సులు, చింతరేవుల సురేష్, కప ట్రాళ్ల వెంకట్‌రెడ్డి, రంగస్వామి గౌ డ్, వానపల్లి ప్రహ్లాద్, భీంపురం రాము, ఓబులోనిపల్లి పరశురా ముడు, జంగిలప్ప, మార్లబీడు రా ము, గోవింద్, పెద్ద సవారన్న, దర్రెప్ప, ఏసన్న ఉన్నారు.