ఏప్రిల్ 6న బూత్‌లలో బీజేపీ జెండా ఎగరేయాలి
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:23 PM
బీజేపీ ఆవిర్భావ దినో త్సవంతో పాటు, అంబేడ్కర్ జయంతి ని పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించాలని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ పిలుపునిచ్చారు.

- పార్టీ ఆవిర్భావ దినోత్సవం, అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలి
- ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
నారాయణపేట, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ఆవిర్భావ దినో త్సవంతో పాటు, అంబేడ్కర్ జయంతి ని పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించాలని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ పిలుపునిచ్చారు. బుదవారం నారా యణపేట శ్యాసన్‌పల్లి రోడ్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తలు, జిల్లా నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. అదేరోజు శ్రీరామ నవమి పూజా కార్యక్రమాల అనంతరం ప్రతీ బూత్‌లలో పార్టీ జెండాలు ఆవిష్కరించాలన్నారు. ప్రతీ కార్యకర్త ఇంటిపై బీజేపీ జెండా ఎగర వేయాలన్నారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించాలన్నారు. అదేరోజు పాఠశాలలు, దేవాలయాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించి, దేశ ప్రజలపై పడుతున్న వేలకోట్ల భారాన్ని ఈ జమిలీ ఎన్నికల ద్వారా తగ్గించే దిశగా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అలాగే వాజపేయి శతజయంతి ఉత్స వాల్లో భాగంగా ఆయన స్పూర్తిని ప్రజల్లోకి తీ సుకువెళ్లాలన్నారు. ప్రధాని మోదీ ప్రతీనెల చివ రి ఆదివారం నిర్వహిస్తున్న మన్‌కీ బాత్ కార్యక్ర మాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అంతకుముందు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నూత నంగా నియామకమైన సత్యయాదవ్‌ను మాజీ ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నాగూరావు నామాజీ, కొం డయ్య, రతంగ్‌పాండురెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రవి కుమార్, కెంచి శ్రీనివాస్, పోషల్ వినోద్, వెంక ట్రాములు, జిల్లా కౌన్సిల్ మెంబర్లు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.