బెట్టింగ్‌ల వైపు వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దు
ABN , Publish Date - Mar 27 , 2025 | 10:50 PM
యువత బెట్టింగ్‌ల జోలికి వెళ్లి జీవితాల ను నాశనం చేసుకోవద్దని గద్వాల సీఐ టంగుటూరి శ్రీను అన్నారు.

గద్వాల సీఐ టంగుటూరి శ్రీను
సరైన పత్రాలు లేని 79 వాహనాలు స్వాధీనం
గద్వాలక్రైం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): యువత బెట్టింగ్‌ల జోలికి వెళ్లి జీవితాల ను నాశనం చేసుకోవద్దని గద్వాల సీఐ టంగుటూరి శ్రీను అన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గురువారం సా యంత్రం జిల్ల కేంద్రంలోని తెలుగుపేట, బీసీకాలనీ, శివాలయం వీధి, రవీంద్ర హై స్కూల్ ప్రాంతాల్లో సీఐ శ్రీను ఆధ్వర్యం లో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రో గ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరుగురు ఎస్‌ఐలు, ముగ్గురు ఆర్‌ఎస్‌ఐ లు, 42మంది పోలీస్‌సిబ్బంది పాల్గొన్నా రు. వీరు మూడు పార్టీలుగా విడిపోయి నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల వ్యక్తిగత వివరాలు సేకరించారు. దాదాపు 200 ఇళ్లను సోదాలు నిర్వహించి సరైనా పత్రాలు లేని 79 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఇందులో ద్విచక్రవాహనాలు-67, ఆటోలు- 10, ఫోర్‌వీలర్-2 ఉన్నాయి. ఈ సందర్బంగా కాలనీవాసులను ఉద్దేశించి సీఐ శ్రీను మాట్లాడుతూ.. నేరాల నిర్మూ లనకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహింస్తున్నామన్నారు. ఎవరైనా కొత్తవ్యక్తులు, నేరస్థులకు షెల్టర్ ఇస్తున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. యువత బెట్టింగ్‌లకు వెళ్లి ఆర్థికంగా నష్టపోయి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దన్నారు. వాహనదారులు తప్పకుండా అన్ని డాక్యుమెంట్స్ కలిగి ఉండాలన్నారు. కాలనీలలో నేరాల నియంత్రణకై సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది ఉన్నారు.