ముంపు సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:43 PM
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భూత్పూరు, మాగనూరు మండలం నేరేడుగం గ్రామాల ముంపు సమస్యలను పరిష్కరించాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి బుధవారం ప్రస్తావించారు.

అసెంబ్లీలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
మక్తల్ రూరల్, మార్చి 26, (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భూత్పూరు, మాగనూరు మండలం నేరేడుగం గ్రామాల ముంపు సమస్యలను పరిష్కరించాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి బుధవారం ప్రస్తావించారు. కేవలం జీవో మాత్రమే విడుదల చేశారని, నోటిఫికేషన్ రాలేదని, దానిని విడుదల చేసి గ్రామాలను తరలించాలని కోరారు. ఇటు జూరాల బ్యాక్ వాటర్ ముంపు గ్రామాలైన అనుగొండ, అంకెన్‌పల్లి, దాదాన్‌పల్లి, సంగంబండ రిజర్వాయర్‌లో ముంపునకు గురైన ఉజ్జెల్లిలో కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వాటిని పూర్తి చేయాలని కోరారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతలలో భాగంగా కాట్రేవ్‌పల్లి వద్ద రైతులు భూములు కోల్పోతున్నారని, వారికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.