Share News

పోక్సో చట్టంలో కఠినమైన శిక్షలు

ABN , Publish Date - Apr 03 , 2025 | 11:07 PM

పొక్సో చట్టంలో కఠినమైన శిక్ష లు ఉన్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి రజని తెలిపారు.

పోక్సో చట్టంలో కఠినమైన శిక్షలు
మాట్లాడుతున్న న్యాయాధికారి రజని

- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని

వనపర్తిలీగల్‌ కంట్రీబ్యూటర్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): పొక్సో చట్టంలో కఠినమైన శిక్ష లు ఉన్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి రజని తెలిపారు. గురువారం పట్టణంలోని గిరిజనుల పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆ ధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పొక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల నుంచి జీవిత ఖైదు కూడా పడే అవ కాశం ఉందన్నారు. బాల్య వివాహాలు గ్రామాల లో ఇప్పటికీ జరుగుతున్నాయని, ప్రతి రోజు నాలుగు వేలకు పైగా బాల్య వివాహలు జరు గుతున్నట్లు సర్వేలలో తెలుస్తుందని ఇది బాధా కరమైన విషయమని అన్నారు. త్వరలో లీగల్‌ సర్వీసెస్‌ క్లబ్‌ను ఈ పాఠశాలలో ఏర్పాటు చే స్తామన్నారు. బాల నాగయ్య, ఉత్తరయ్య, స్వా తి, ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 11:07 PM