Share News

నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:14 PM

ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పదేళ్లుగా ఇళ్లు లేక నిత్యం జీవన పోరాటం చేస్తున్న మండలంలోని దేపల్లి గ్రామ కష్టాలు త్వరలో తీరనున్నాయి.

 నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న అధికారులు

- దేపల్లి గ్రామానికి 97 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

నవాబ్‌పేట, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పదేళ్లుగా ఇళ్లు లేక నిత్యం జీవన పోరాటం చేస్తున్న మండలంలోని దేపల్లి గ్రామ కష్టాలు త్వరలో తీరనున్నాయి. గ్రామానికి చెందిన దేపల్లి వెంకటేష్‌ గౌడ్‌ విన్నపం మేరకు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆదర్శ గ్రామంగా ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేను ఒప్పించి ఏకంగా 97 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించడంతో గ్రామస్థుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని దేపల్లి గ్రామం నిన్నటి దాక మండలంలో పెద్దగా ఎవ్వరికి తెలియని గ్రామం. కానీ నేడు గ్రామానికి 92 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇటీవలే గ్రామస్థులు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించడంతో పలువురు అబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తీరిన రుణమాఫీ : చాల గ్రామాల్లో వివిధ కారణాల వల్ల రుణమాఫీ అమలు కాలేదు. కానీ ఈ గ్రామంలో 113 మందికి పైగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ రూ.91,00,685 పూర్తి స్థాయిలో అమలైంది.

ఒకేసారి రైతు భరోసా : గ్రామంలో ఏక కాలంలో రైతు భరోసా పథకం కింద అర్హత కల్గిన 422 మంది రైతులకు ప్రభుత్వం బ్యాంకుల్లో నగదు జమ చేసింది. అదే విధంగా ఆత్మీయ భరోసా కింద గ్రామానికి చెందిన భూమిలేని నిరుపేదలకు ముగ్గురికి రూ.6000 చొప్పున అందజేశారు.

Updated Date - Mar 26 , 2025 | 11:14 PM