కొత్త ఓటరు నమోదు ప్రారంభం
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:25 PM
కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది.

- ఇక ఏటా నాలుగు సార్లు
- 18 ఏళ్లు నిండిన యువత నమోదు చేసుకోవాలి
నారాయణపేట, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఏప్రిల్ 1 నుంచి 18 ఏళ్లు నిండిన యువతరం ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకా శం కల్పిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరు తున్న అభ్యర్థులు కొత్త ఓటర్లను నమోదు చే యించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గతం లో ఏటా జనవరిలో కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం అలా కాకుండా జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్‌లలో ఓటరు నమోదుకు అవకాశం కల్పించారు. 18 ఏళ్లు నిండిన వారు బూత్ స్థాయి అధికారి వద్ద లేక ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక ఎన్నికల దృష్ట్యా పట్టణాల్లో ఉన్నవారు అక్కడి నుంచి ఓటు బదిలీ చేసుకునే అవకాశం ఉంది. 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆర్డీవో రాంచందర్ కోరారు.