Share News

విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంపొందించాలి

ABN , Publish Date - Mar 24 , 2025 | 11:14 PM

విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంపొందించేందుకే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా (ఏఐ) కృతిమ మేధ కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని ప్రారంభిస్తుందని డీఈవో ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంపొందించాలి
నిజాలాపూర్‌లో ఏఐ కంప్యూటర్‌ శిక్షణలో విద్యార్థులకు నేర్పిస్తున్న డీఈవో ప్రవీణ్‌కుమార్‌

- డీఈవో ప్రవీణ్‌కుమార్‌

మూసాపేట, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంపొందించేందుకే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా (ఏఐ) కృతిమ మేధ కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని ప్రారంభిస్తుందని డీఈవో ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని నిజాలాపూర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎన్‌ ఏయాక్స్‌ఎల్‌ (ఏఐ) బోధనలో భాగంగా కంప్యూటర్‌ ల్యాబ్‌ను డీఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా విద్యార్థులచే తెలుగు, ఆంగ్లం, గణితం అంశాలను కంప్యూటర్‌ ముందు కూర్చొని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో విన్నూతంగా, విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచడానికి దోహదపడుతుందన్నారు. దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోనేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలన్నారు. అదే విధంగా మండలంలోని వేముల, పోల్కంపల్లి, చక్రపూర్‌ పాఠశాలల్లో కూడా ఏఐ కంప్యూటర్‌ శిక్షణను ఎంఈవో రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలో ప్రారంభించారు. హెఛ్‌ఎంలు సరిత, బాలకిష్టమ్మ, రవీందర్‌, ఏఎంసీ చైర్మన్లు రామేశ్వరమ్మ, లావణ్య, ఆర్పీ రాఘవేందర్‌ ఉన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 11:14 PM