విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:16 PM
విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని కర్ని శివారులో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్నది. గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

మక్తల్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని కర్ని శివారులో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్నది. గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మక్తల్ మునిసిపాలిటీ పరిధిలోని చందాపూర్ గ్రామానికి చెందిన యువకుడు మహే ష్‌కుమార్(23) మండలంలోని కర్ని గ్రామ శివారులో కూలీగా వెళ్లి విద్యుత్ తీగలు సరిచేస్తున్నాడు. అదే సమయంలో విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతంతో స్తంభం పైనుంచి కింద పడిపోయాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు మక్తల్ విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు 3 గంటల పాటు ధర్నా నిర్వహించారు. డీఈ నర్సింగరావు, ఏడీ జగన్మోహన్, ఏఈ రామకృష్ణ ఘటనాస్థలానికి చేరుకొని బాధిత కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం అందిస్తామని హామి ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. ఆందోళన కారణంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.