అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:03 AM
రామగుండం అభి వృద్ధికి నిధులు తీసుకువచ్చే బాధ్యత తనదని, ప్రస్తు తం అభివృద్ధి పనులకు నిధులు అందుబాటులో ఉన్నా యని, పనుల్లో వేగం పెంచాలని రామగుండం ఎమ్మె ల్యే రాజ్‌ఠాకూర్ అధికారులను ఆదేశించారు. సోమవా రం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ అరుణశ్రీ, సింగరేణి ఆర్‌జీ-1 జీఎం లలి త్‌కుమార్, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

కోల్‌సిటీ,మార్చి 31(ఆంధ్రజ్యోతి): రామగుండం అభి వృద్ధికి నిధులు తీసుకువచ్చే బాధ్యత తనదని, ప్రస్తు తం అభివృద్ధి పనులకు నిధులు అందుబాటులో ఉన్నా యని, పనుల్లో వేగం పెంచాలని రామగుండం ఎమ్మె ల్యే రాజ్‌ఠాకూర్ అధికారులను ఆదేశించారు. సోమవా రం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ అరుణశ్రీ, సింగరేణి ఆర్‌జీ-1 జీఎం లలి త్‌కుమార్, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సుమారు రూ.80కోట్ల నిధులు అదనంగా అందుబాటులోకి వస్తు న్నాయని, ప్రస్తుతం జరుగుతున్న టీయూఎఫ్ ఐడీసీ, 15వ ఆర్థిక సంఘం పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సింగరేణి కాలనీల్లో ఇప్పటికే ఇంటర్న ల్ రోడ్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందని, మరికొన్ని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కానున్నాయన్నారు. సింగరేణి ప్రాంతాల్లో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉందని, రోజు విడిచి రోజు చెత్త తీసుకెళుతున్నారని, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడే చెత్త కనిపిస్తుందన్నారు. రాజీవ్ రహదారి సర్వీస్ రోడ్డు నిర్మాణానికి టెం డర్ల ప్రక్రియ పూర్తయ్యిందని, ఈ రహదారికి ఇరువైపులా ల్యాండ్ స్కేపింగ్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాల న్నారు. 2ఏ మోరీ నుంచి ఫైవింక్లయిన్ మోరీలను కలుపుతూ రోడ్డు నిర్మిం చాలన్నారు. ఈ రెండు చోట్ల వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్ర త్తలు తీసుకోవాలన్నా రు. శ్రీరామ నవమి వేడుక లను ఘనంగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్‌టీపీ సీకి కలెక్టర్ రూ.41కోట్ల పనులకు ప్రతిపాదనలు చేస్తే రూ.8 కోట్ల ప్రతిపాదన పనులను కార్పొరేట్‌కు పంపడం బాధ్యత రాహిత్య మని, రామగుండానికి రావాల్సింది రూ.225కోట్లు అని, నిధుల మంజూ రులో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా తమవైపు నుంచి కూడా అదే విధంగా ప్రతిఘటన ఉంటుందన్నారు. రామగుండం పట్టణంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, ఫ్లైఓవర్, డబుల్ రోడ్డు నిర్మా ణంతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంద న్నారు. మెడికల్ కళాశాల రోడ్డు విస్తరణతోపాటు రాజీవ్ రహ దారి పక్కన ఖాళీ స్థలంలో ప్రజలకు ఉపయోగడే నిర్మాణాన్ని చేపడుతామన్నారు. సమావేశంలో ఆర్‌ఎఫ్ సీఎల్ డీజీఎం రమేష్ ఠాకూర్, సీనియర్ మేనేజర్ వెంకటరెడ్డి, సింగరేణి ఎస్‌ఈ(సివిల్) వరప్రసాద్, ఎన్‌టీపీసీ అధికారి సూర్య నారాయణ, డిప్యూటీ కమి షనర్ వెంకటస్వామి, ఈఈ రామన్ పాల్గొన్నారు.