మార్కెట్‌కు 21వేల బస్తాల ధాన్యం రాక
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:28 AM
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం యాసంగి ధాన్యం భారీగా వచ్చింది.

భానుపురి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం యాసంగి ధాన్యం భారీగా వచ్చింది. ఈ సీజనలో మొదటిసారిగా 21,680 బస్తాల ధాన్యం వచ్చింది. మార్కెట్‌కు వ్యవసాయ ఉత్పత్తులు అన్ని కలిపి 445 మంది రైతులు 22,475 బస్తాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో వ్యవసాయ మార్కెట్లకు రైతులు ధాన్యం తీసుకువస్తున్నారని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ధాన్యం మద్దతు ధర రూ.2,320 ఉండగా ఏ ఒక్క బస్తాకూ మద్దతు ధర లభించలేదు. పాత ధాన్యానికి మాత్రమే క్వింటాకు రూ.2,600 ధర పలికింది.
రకం బస్తాలు
ఐఆర్-64 12,064
జైశ్రీరాం 6,540
జైశ్రీరాంపాతవి 140
హెచఎంటీ 2,549
బీపీటీ 286
బీపీటీపాతవి 101
కందులు 232
పెసర 465
వేరుశనగ 90