Share News

ధాన్యం కొనుగోలులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుతాం

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:55 AM

ధాన్యం కొనుగోలులో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాలబావి వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, తిప్పర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ధాన్యం కొనుగోలులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుతాం

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ, తిప్పర్తి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలులో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాలబావి వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, తిప్పర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసి, ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం సన్నధాన్యం కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. సన్నధాన్యానికి ఇస్తున్న రూ.500 బోన్‌సను సద్వినియోగం చేసుకోవాలన్నారు. యాసంగిలో జిల్లాలో 375 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్మాని, ధాన్యం రాకను బట్టి అవసరమైతే మరిన్ని కేంద్రాలు పెంచుతామన్నారు. మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉగాదిన హుజూర్‌నగర్‌లో రేషన్‌ కార్డుదారులకు సన్నబియ్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఉదయ సముద్రం ద్వారా ఎల్లారెడ్డిగూడెం వరకు సాగునీరు అందిస్తున్నామని శ్రీశైలం హైడల్‌ ప్రాజెక్టు ద్వారా ఏఎమ్మార్నీ నుంచి నీరు తీసుకురానున్నామని తెలిపారు. బ్రాహ్మణవెల్లెంల పూర్తిచేసి మర్రిగూడెం చెరువుకు నీరిస్తామన్నారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, గత ఏడాది సన్న ధాన్యం 45వేల మెట్రిక్‌ టన్నులు సేకరించగా, రైతులకు రూ.22కోట్లు బోన్‌సగా చెల్లించామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ కుంభం శ్రీనివా్‌సరెడ్డి, అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి హరీష్‌, డీఆర్డీవో శేఖర్‌రెడ్డి, డీసీవో పత్యా నాయక్‌, మార్కెటింగ్‌ ఏడీ ఛాయాదేవి, జేడీఏ శ్రవణ్‌కుమార్‌, ఆర్డీవో వై.అశోక్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జూపూడి రమేష్‌, పాశం సంపత్‌రెడ్డి, నాగరత్నంరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 12:55 AM