Share News

నిర్భయంగా.. ఉన్నది ఉన్నట్లుగా.. అదీ ‘ఆంధ్రజ్యోతి’ స్పెషల్‌

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:52 AM

భయం లేకుండా, ప్రజా సమస్యలే ఎజెండాగా ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ముందుకు సాగుతోందని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆగ్రస్థానానికి చేరుకోవాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆకాంక్షించారు.

నిర్భయంగా.. ఉన్నది ఉన్నట్లుగా.. అదీ ‘ఆంధ్రజ్యోతి’ స్పెషల్‌

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పత్రిక ఆగ్రస్థానంలో నిలవాలి

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఘనంగా ‘ఆంధ్రజ్యోతి’ కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌ యూనిట్‌ డ్రా

నల్లగొండ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): భయం లేకుండా, ప్రజా సమస్యలే ఎజెండాగా ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ముందుకు సాగుతోందని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆగ్రస్థానానికి చేరుకోవాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వంలో, ప్రతిపక్షంలో ఎవరు న్నా భయపడకుండా వెనకడుగు వేయకుండా, ఉన్నది ఉన్నట్లు రాయడం ‘ఆంధ్రజ్యోతి’ స్పెషల్‌ అని కొనియాడారు. 22వ వార్షికోత్సవ పురస్కారంలో భాగంగా సోమవారం నల్లగొండ ‘ఆంధ్రజ్యోతి’ యూనిట్‌ కార్యాలయంలో కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌ డ్రా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు డ్రా తీసి విజేతలు కార్తీక్‌, వెంకటేశం, శంకర్‌రావుకు ఫోన్‌ద్వారా మంత్రి సమాచారం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దినపత్రికగా వెలుగొందుతూ అత్యధిక సర్క్యులేషన్‌తో ప్రజల ఆదరాభిమానాలను చూరగొనడం సంతోషకరమన్నారు. ప్రతి ఏటా అక్కా, చెల్లెమ్మలకు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించడంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పాఠకులకు కోటి రూపాయల బహుమతులు అందజేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొంటూ ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌ కార్యక్రమాన్ని సర్క్యులేషన్‌లో భాగంగా డ్రా ద్వారా పాఠకులకు బహుమతులు అందజేయడం అభినందనీయమన్నారు. త్వరలోనే సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలతో, డైమండ్‌ ఉత్సవాలు నిర్వహించుకుని ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఇదేవిధంగా కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ‘ఆంధ్రజ్యోతి’ నల్లగొండ బ్రాంచ్‌ మేనేజర్‌ దాసరి చంద్రశేఖర్‌రావు, బ్యూరో ఇన్‌చార్జి చల్లా సాంబశివారెడ్డి, డిప్యూటీ మేనేజర్‌ ఆందోజు కృష్ణమాచారి, కాంగ్రెస్‌ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మ ల మోహన్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, ఏసీఏం ఉన్నం భాస్కర్‌రావు, ఏబీఎన్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌ కుర్రె రవికుమార్‌, నల్లగొండ పీసీ ఇన్‌చార్జి పులిమామిడి మహేందర్‌రెడ్డి, పాల్గొన్నారు.

నేను మంత్రి కోమటిరెడ్డిని..

విజేతలతో ఫోన్‌లో ఉల్లాసంగా సంభాషణ

హోలో.. నేను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని మాట్లాడుతున్నా.. మీకు ఉగాది సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ తరఫున బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నా.. అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డ్రా విజేతలతో ఫోన్‌లో మాట్లాడి ఉత్సాహపరిచారు. నల్లగొండ యూనిట్‌ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు డ్రా తీసిన అనంతరం విజేతలకు మంత్రి ఫోన్‌చేసి శుభాకాంక్షలు తెలిపి సరదాగా సంభాషించి వారిని సంతోషపరిచారు. ప్రథమ బహుమతి విజేతకు మోటార్‌ బైక్‌, ద్వితీయ బహుమతి 185 లీటర్ల ఫ్రిడ్జ్‌, తృతీయ బహుమతి 32 అంగుళాల టీవీని ‘ఆంధ్రజ్యోతి’ తరఫున అందిస్తామని చెప్పి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బహుమతులను కూడా తానే స్వయంగా అందజేస్తానని అన్నారు.

విజేతలు వీరే..

ప్రథమ బహుమతి : ఏలుగూరి కార్తీక్‌, సూర్యాపేట జిల్లా

ద్వితీయ బహుమతి : చిలువేరు వెంకటేశం, చిలుకూరు

తృతీయ బహుమతి : పోనుగోటి శంకర్‌రావు, నల్లగొండ

Updated Date - Mar 25 , 2025 | 12:52 AM