Share News

గడువులోపు చెల్లించకుంటే అధిక భారం

ABN , Publish Date - Mar 25 , 2025 | 01:01 AM

గడువులోపు చెల్లించకుంటే అధిక భారం గడువులోపు చెల్లించకుంటే అధిక భారం ఈ నెల 31లోగా చెల్లిస్తే వారికి 25శాతం రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు.

గడువులోపు చెల్లించకుంటే అధిక భారం

ఎల్‌ఆర్‌ఎ్‌సను సద్వినియోగం చేసుకోవాలి 8 ‘గుట్ట’ మునిసిపల్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌రెడ్డి

గడువులోపు చెల్లించకుంటే అధిక భారం గడువులోపు చెల్లించకుంటే అధిక భారం ఈ నెల 31లోగా చెల్లిస్తే వారికి 25శాతం రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ఫోనఇన కార్యక్రమం ద్వారా ప్లాట్ల యజమానులు అడిగిన సందేహాలను ఆయన నివృత్తి చేశారు.

- (ఆంధ్రజ్యోతి, యాదగిరిగుట్ట రూరల్‌)

ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించాలా?

- సార కరుణాకర్‌, యాదగిరిగుట్ట

కమిషనరు: ప్రభుత్వం చెల్లించిన ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ అవసరం లేదు.

ఎల్‌ఆర్‌ఎస్‌ 25శాతం రాయితీ గడువు పెంచాలి

- మారగోని శ్రీరాంమూర్తి, కల్లెపల్లి మహేందర్‌, రామారావు బందారపు మల్లేశం, యాదగిరిగుట్ట

కమిషనర్‌: ప్లాట్ల యజమానులు ప్రధానంగా గడువు లోపే ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లిస్తేనే వారికి నష్టం జరగదు. గడువు పెంచాలని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతాం. ఒకవేళ గడువు పెంచకపోతే అధికంగా భారం పడి ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

89 సర్వేనంబర్‌లోని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టే అవకాశం ఉందా?..

- శ్రీనివాస్‌ యాదగిరిగుట్ట

కమిషనర్‌: గుట్ట పట్టణ పరిధిలో సర్వేనెంబర్‌89లో ప్రభుత్వ భూమి ఉన్నందున ఆ భూమిలో ఉన్న ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించే అవకాశం లేదు.

ఎల్‌ఆర్‌ఎస్‌ సబ్సిడీ 50శాతానికి పెంచాలి

- కర్రె ప్రవీణ్‌, యాదగిరిగుట్ట

కమిషనర్‌: ఎల్‌ఆర్‌ఎ్‌సకు 50శాతం సబ్సిడీ రాయితీ పెంచే అవకాశం, 2025 వరకు కటాఫ్‌ తేదీ పెంచే అవకాశం మాకు లేదు. జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకు వెళతాం.

అక్రమ వెంచర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

- రాము, యాదగిరిగుట్ట

కమిషనర్‌: అక్రమ వెంచర్లలోని ప్లాట్ల క్రయ విక్రయాలు చేయకుండా సంబంధిత భూముల సర్వేనంబర్లను సబ్‌రిజసా్ట్రర్‌కు అందజేసి, వాటిని రిజిస్టేషన్లు చేయొద్దని లేఖ రాస్తాం. వాటికి ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతి ఉండదు.

ఎన్ని గజాల వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించవచ్చు

-ఎక్కలదేవి భాస్కర్‌, యాదగిరిగుట్ట

కమిషనర్‌: ఎన్ని గజాల విస్తీర్ణానికైనా ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించే అవకాశం ఉంది.

ఐదు ప్లాట్లు కలిపి ఒకే డాక్యుమెంట్‌ చేశాం

-పేరబోయిన మహేందర్‌, కొత్తగుండ్లపల్లి

కమిషనర్‌: ఐదు ప్లాట్లు ఒకే డాక్యుమెంట్‌తో చేసినప్పటికీ వేర్వేరుగా ప్లాట్లు ఉంటే వాటికి వేర్వేరుగానే ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించాలి. అన్నింటికీ ఒకే ఎల్‌ఆర్‌ఎస్‌ సరిపోదు.

2019 సంవత్సరంలో ప్లాటుకు..?

-గంగసాని రామారావు, యాదగిరిగుట్ట

కమిషనర్‌: 2019 సంవత్సరంలో గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎ్‌సకు రూ. 10000 చెల్లిస్తే ప్రస్తుతం అది పరిగణనలోకి తీసుకోలేం. ఈ విషయంపై ప్రభుత్వ నిర్ణయం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించినప్పటికీ పెండింగ్‌ వస్తోంది

-గోవర్ధన్‌, యాదగిరిగుట్ట

కమిషనర్‌: ఇటీవల ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లిస్తే తప్పకుం డా అనుమతి లభిస్తుంది. పూర్తిగా సందేహాల నివృ త్తిచేసుకోవాలంటే కార్యాలయంలో సంబంధిత సి బ్బంది సంప్రదిస్తే ఫీజు ఎంత చెల్లించాలో తెలుపుతారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లిస్తే లాభాలు ఏమిటి?

- రాయగిరి జగదీష్‌గౌడ్‌ యాదగిరిగుట్ట

కమిషనర్‌: ఎల్‌ఆర్‌ఎ్‌సతో ప్లాట్‌ క్రమబద్ధీకరణ అవుతుంది. ఇల్లు నిర్మాణం చేసే సమయంలో దాని కి మునిసిపల్‌ అనుమతి, బ్యాంకు రుణాలు, మార్టిగేజ్‌ రుణాలు పొందవచ్చును. మార్కెట్‌ ధర పెరి గి క్రయ విక్రయాల సమయంలో రిజిస్ర్టేషన్‌ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం ఉందా?

- తోట శంకర్‌, యాదగిరిగుట్ట

కమిషనర్‌: ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు మొత్తం ఏకకాలంలో చెల్లించాలి. వాయిదాల పద్ధతి లేదు. గడువు దాటి తే 25శాతం రాయితీ వర్తించదు.

నోటరీ ప్లాటుకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తిస్తుందా?

- సీస శ్రీనివాస్‌, యాదగిరిగుట్ట

కమిషనర్‌: నోటరీ ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించే అవకాశం లేదు.

ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు ఎలా నిర్ణయిస్తున్నారు

-మధు సూధన్‌రెడ్డి యాదగిరిగుట్ట

కమిషనర్‌: ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేకుంటే ప్లాటు రిజిస్ర్టేషన్‌ చేసుకున్నప్పుటి తేదీనాటికి ఎంత విలువ ఉందో అందులో 14శాతం. బేసిక్‌ రెగ్యులరైజేషన్‌ చార్జీలతో కలిపి ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు జమకడతారు.

Updated Date - Mar 25 , 2025 | 01:01 AM