పొలాలకు నీళ్లివ్వడంలో నిర్లక్ష్యం
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:26 AM
యాసంగి సీజనలో వరి పంటకు నీళ్లివ్వలేమని ప్రభుత్వం చెప్పకుండా మోసం చేస్తే, వచ్చే కాస్త నీటిని రైతులకు అందించడంలో అధికారులు పక్షపాతం, నిర్లక్ష్యం వహించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశా రు.

ఆత్మకూరు(ఎస్), మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : యాసంగి సీజనలో వరి పంటకు నీళ్లివ్వలేమని ప్రభుత్వం చెప్పకుండా మోసం చేస్తే, వచ్చే కాస్త నీటిని రైతులకు అందించడంలో అధికారులు పక్షపాతం, నిర్లక్ష్యం వహించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. సోమవారం మండలంలోని కోటినాయక్‌తండాలోని సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై ఎస్సారెస్పీ కాల్వ వద్ద రాస్తారోకో నిర్వహించారు. పంట చేతికి వచ్చే సమయంలో నీళ్లు రావడం లేదం టూ ఆందోళన వ్యక్తం చేశారు. వారబందీ ప్రకారం గోదావరి జలా లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మెయిన కాల్వ నుంచి రెండు రోజులు ఎల్-22 కాల్వకు, రెండు రోజులు ఎల్-36కు రెండు రోజు లు, మెయినకాల్వ ద్వారా పెనపహాడ్ వైపు నీళ్లు వదలాల్సి ఉండ గా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు గేట్లు తీసి నీటిని మళ్లించుకోవడం తో దిగువనకు నీరందక పొలాలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు ఆందోళన కొనసాగింది. ఎస్‌ఐ శ్రీకాంతగౌడ్ సమాచారం తెలుసుకుని రైతుల వద్దకు అక్కడి నుంచి ఇరిగేషన అధికారులు రప్పించారు. ఏఈ సురేష్ ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు చేరుకుని వారితో మాట్లాడారు. అనంతరం క్రేన సహాయంతో 71డీబీఎం మె యిన కాల్వ గేట్లను మూసివేసి, ఎల్-36కు నీటిని మళ్లించడంతో రైతులు ఆందోళన విరమించారు. ఇదిలా ఉండగా యాసంగి సీజనలో గోదావరి జలాలు అందించడంలో ఇరిగేషన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిందిస్థాయిలో వర్క్ ఇనస్పెక్టర్లు తప్ప ఏఈ నుంచి డీఈ, ఈఈలు కాల్వల్లో నీటిని పరిశీలించేందుకు సుముఖంగా లేరని తెలుస్తుంది. నెలలో ఒక్కసారైనా కాల్వల పరిశీలనకు ఇరిగేషన అధికారులు రావడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేసి కాల్వల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.