Share News

గడువులోగా చెల్లిస్తేనే రాయితీ

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:49 AM

భువనగిరి టౌన్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : భువనగిరి మునిసిపల్‌ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌కు కటాప్‌ తేదీ నాటికి రూ.వెయ్యి ఫీజు చెల్లించి 15,533 దరఖాస్తులు వచ్చినట్లు కమిషనర్‌ తెలిపారు.

 గడువులోగా చెల్లిస్తేనే రాయితీ

భువనగిరి టౌన్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : భువనగిరి మునిసిపల్‌ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌కు కటాప్‌ తేదీ నాటికి రూ.వెయ్యి ఫీజు చెల్లించి 15,533 దరఖాస్తులు వచ్చినట్లు కమిషనర్‌ తెలిపారు. వీటిలో 13 వేల దరఖాస్తులకు ఆటో ఫీజు ఇంటిమేషన్‌ వచ్చింది. కానీ 6,400 దరఖాస్తులు మాత్రమే ఎల్‌ఆర్‌ఎ్‌సకు అనువుగా ఉన్నాయి. 4,600 దరఖాస్తులకు షార్ట్‌పాల్స్‌ ఉన్నవి. వాటి ఆధారంగా దరఖాస్తుదారులు వెంటనే లాగి న్‌లో అప్‌లోడ్‌ చేయాలి. 551 మంది రూ.2.50 కోట్లు ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకున్నట్లు తెలిపారు. 1,400 దర ఖాస్తులు మునిసిపల్‌ పరిధిలో లేనివిగా గుర్తించినట్లు మిగతా 600 దరఖాస్తులు అస్పష్టంగా ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలు కోసం ప్రణాళిక విభాగాన్ని సంప్రదించాలి.

ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు ఎలా చెల్లించాలి : మాధవి, సీతానగర్‌

ఎల్‌ఆర్‌ఎస్‌ టోకెన్‌ కట్టిన ప్లాట్‌ను కొనుగోలు చేశాను. కానీ మునిసి పల్‌ కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదు. నేను ఫీజు ఎలా చెల్లించాలి.

కమిషనర్‌ : ప్లాట్‌ డాక్యుమెంట్‌తో మునిసిపల్‌ కార్యాలయంలోని టీపీఎస్‌ సెక్షన్‌ను సంప్రదిస్తే ఫీజు వివరాలు చెబుతారు. అలాగే మీ ఫోన్‌ నంబర్‌ను నమోదు చేసుకుంటారు.

ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా : నిర్మల

భువనగిరి పట్టణ శివారులోని నీలగిరి థియేటర్‌ వద్ద 1985లో ప్లాట్‌ కొనుగోలు చేశాను. గతంలో ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకోలేదు. ఇప్పుడు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నదా..!

కమిషనర్‌ : ప్రభుత్వం ప్రకటించిన 26 ఆగస్టు 2020లోపు దరఖాస్తు చేసుకొని రూ.1000 చెల్లించిన వారికే ఇప్పుడు వర్తిస్తుంది.

నా ప్లాట్‌కు ఫీజు ఎలా చెల్లించాలి : వాకిటి నాగేందర్‌రెడ్డి

కమిషనర్‌ : ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు నగదు స్వీకరించబడదు. కేవలం ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. కార్డ్‌ పేమెంట్‌, నెట్‌ బ్యాంకింగ్‌ తదితర విధా నాల్లో చెల్లించవచ్చు.

గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోలేదు. ఆ ప్లాట్‌లో ఇంటినికట్టాలనుకుంటున్నా : భరత్‌కుమార్‌

కమిషనర్‌ : గతంలో దరఖాస్తు చేసుకున్న వారికే ప్రస్తుతం ఎల్‌ఆర్‌ ఎస్‌ వర్తిస్తుంది. అయితే ఇంటి నిర్మాణ అనుమతుల కోసం చేసుకునే దరఖాస్తుతో ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజును చెల్లిస్తే అనుమతులు లభిస్తాయి. కానీ 25శాతం రాయితీ లభించదు.

నోటరీ ప్లాట్‌లకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తిస్తుందా : శివకుమార్‌

కమిషనర్‌ : రిజిస్ర్టేషన్‌ ప్లాట్‌లకు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌ వ ర్తిస్తుంది.

ప్రొసీడ్‌ ఫర్‌ పేమెంట్‌ అని చూపిస్తున్నది : నాగరాజు

ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లింపు కోసం సిటిజన్‌ లాగిన్‌ అయితే ప్రొసీడ్‌ ఫర్‌ పేమెంట్‌, ఎల్‌-3 స్టేజ్‌ అని చూపిస్తున్నది. ఫీజు చెల్లించాలా వద్దా..?

కమిషనర్‌ : ప్రొసీడ్‌ ఫర్‌ పేమెంట్‌ అని డిస్‌ప్లే అయితే వెంటనే ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించండి. ఎల్‌-3 మునిసిపల్‌ కమిషనర్‌ లాగిన్‌లో ఉంటుంది. ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతుల ప్రక్రియలో ఎల్‌-3దే చివరి దశ.

25శాతం ఫీజు రాయితీ గడువును పొడిగించాలి : భాస్కర్‌

నేను ప్రభుత్వ ఉద్యోగిని. ఇటీవల వేతనం నుంచి ఐటీని రికవరీ చేశారు. అలాగే ఆస్తి పన్ను చెల్లించాను. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ 25శాతం ఫీజు రాయితీ గడువును పొడిగించండి.

కమిషనర్‌ : ఐటీ, ఆస్తి పన్ను చెల్లింపు నిరంతర ప్రక్రియ. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు 25శాతం రాయితీ ఈ నెల 31తోనే ముగుస్తుంది. గడువు పొడిగించే అవకాశాలు లేవు. గడువు లోపు చెల్లిస్తేనే రాయితీ వర్తిస్తుంది. లేని పక్ష్యంలో పూర్తి స్థాయి ఫీజును చెల్లించాల్సిందే.

వాయిదాల వారీగా చెల్లించవచ్చునా ? హరిబాబు

నా ప్లాట్‌ ఎల్‌ఆర్‌ఎ్‌సకు రూ.40వేలు ఫీజు విధించారు. వాయిదాల వారిగా చెల్లించవచ్చునా..?

కమిషనర్‌ : ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజును ఏక మొత్తంలో గడువు లోపు చెల్లిం చాలి. వాయిదాల చెల్లింపులకు అనుమతులు లేవు. గడువు దాటితే 25శాతం రాయితీ వర్తించదు.

అనుమతులు లేని ఓ వెంచర్‌ ప్లాటుకు వర్తిస్తుందా : ఎండీ షమీయోద్దీన్‌ , భువనగిరి

అనుమతులు లేని వెంచర్‌లో ప్లాట్‌ కొనాలనుకుంటున్నాను. ఎల్‌ఆర్‌ ఎస్‌ నాకు వర్తిస్తుందా..?

కమిషనర్‌ : ప్రభుత్వ కటాఫ్‌ డేట్‌ 26 ఆగస్టు 2020లోపు ఆ వెంచర్‌ లో 10శాతం ప్లాట్లు రిజిస్ర్టేషన్‌ అయి ఉంటే మీరు కొనుగోలు చేస్తున్న ప్లాట్‌ను ఈ నెల 31లోపు 25శాతం రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించి రిజిస్ర్టేషన్‌ చేసుకుంటే ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తిస్తుంది.

ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజును ఎలా లెక్కిస్తున్నారు.? పావని

కమిషనర్‌: ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్‌ రిజిస్ర్టేషన్‌ అయిన తేదీ నాటికి సబ్‌ రిజిస్ర్టేషన్‌ వాల్యూలో 14 శాతం, బేసిక్‌ రెగ్యులరైజేషన్‌ చార్జీలతో కలిపి ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజును లెక్కిస్తున్నాం ఫీజు వివరాలు రావడం లేదు : అశోక్‌

కమిషనర్‌: వక్ఫ్‌ బోర్డు, చెరువు శిఖం, ఎఫ్‌టీఎల్‌, ప్రభుత్వ, అసైన్డ్‌, నిషేధిత భూముల సర్వే నంబర్ల సమీపంలోని సర్వే నంబర్ల ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చారు. మీ ప్లాట్‌ షార్ట్‌ ఫాల్‌ను మీరు అప్‌లోడ్‌ చేసినందున ఆ వివరాలు మునిసిపల్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారుల లాగిన్‌లలోకి వెళ్తాయి. ఆ లాగిన్‌ ఆధారంగా షార్ట్‌ పాల్స్‌ను ఆప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. నేరుగా అధికారులను సంప్రదిస్తే మేలు.

ఎల్‌ఆర్‌ఎస్‌తో ఎలాంటి లాభాలు ఉంటాయి : డాక్టర్‌ భరత్‌

కమిషనర్‌ : ఎల్‌ఆర్‌ఎ్‌సతో ప్లాట్‌ క్రమబద్ధ్దీకరణ అవుతుంది. ఆ ప్లాట్‌లో కట్టే ఇంటికి మునిసిపల్‌ అనుమతులు, బ్యాంక్‌ రుణాలు సులభంగా లభిస్తాయి. మార్కెట్‌ ధర పెరుగుతుంది. విక్రయ సమ యంలో రిజిస్ర్టేసన్‌ అవుతుంది. మార్టిగేజ్‌ రుణాలు కూడా లభిస్తాయి.

అక్రమ వెంచర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు : సురేందర్‌

కమిషనర్‌ : అక్రమ వెంచర్లు, ప్లాట్ల క్రమ విక్రయాలపై సబ్‌ రిజిస్ర్టా ర్‌కు లేఖ రాశాము. అట్టి రిజిస్ర్టేషన్‌ను నిలిపివేయాలని కోరాము. ఆ ప్లాట్‌లకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తించదు, నిర్మాణ అనుమతులు లభించవు.

వక్ఫ్‌ బోర్డు భూములకు వర్తిస్తుందా : ఎండీ మహమూద్‌

వక్ఫ్‌ బోర్డు భూములకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తిస్తుందా లేదా..? రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్నవారి పరిస్థితి ఏమిటి..?

కమిషనర్‌ : వక్ఫ్‌ బోర్డు భూములకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తించదు. గతం లో కొన్నింటికి వర్తించాయి. కానీ నేడు నిబంధనలు కఠినతరమయ్యా యి. వక్ఫ్‌ బోర్డు భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. వక్ఫ్‌ బోర్డు భూముల సరిహద్దులను గుర్తించాలని లేఖ రాశాం. హద్దులు గుర్తించాక ఎల్‌ఆర్‌ఎ్‌సపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

Updated Date - Mar 21 , 2025 | 12:49 AM