సమాజసేవతో ఆర్థిక, ఆరోగ్య విజయం
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:17 AM
నిస్వార్థ సమాజసేవ, దైవచింతనతోనే వ్యక్తులు ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్నిరంగాల్లో విజయం సాధిస్తారని రామానుజ చినజీయర్‌స్వామి అన్నా రు.

మైహోం బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న చినజీయర్‌స్వామి
మేళ్లచెర్వు, మార్చి 22 (ఆంధ్రజ్యో తి) : నిస్వార్థ సమాజసేవ, దైవచింతనతోనే వ్యక్తులు ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్నిరంగాల్లో విజయం సాధిస్తారని రామానుజ చినజీయర్‌స్వామి అన్నారు. మండలకేంద్రంలోని మైహోం సిమెంట్స్ పరిశ్రమలోని వేంకటేశ్వరస్వామి ఆలయ 27వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం కల్యాణాన్ని నిర్వహించారు. కల్యాణానికి చినజీయర్‌స్వామితో పాటు అహోబిల రామానుజజియర్ స్వామి, దేవానాద జియర్‌స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చినజియర్‌స్వామి మాట్లాడుతూ వేంకటేశ్వరస్వామి స్థాన విశిష్టతను వివరించారు. మైహోం గ్రూప్ చైర్మన డాక్టర్ రామేశ్వర్‌రావు తన జీవిత కాలంలో 90 శాతం సమయాన్ని సమాజ సేవ కోసమే వినియోగించటంతో పాటుగా దాదాపుగా 15 ఆలయాలను సొంతంగా నిర్మించిన కారణంగా నే ఆర్థికంగా, ఆరోగ్యంగా ఈ స్థాయికి ఎదిగారన్నారు. స్వామి వారి అనుగ్రహం వల్లే ప్రజలు సుభిక్షంగా ఉంటున్నారని వివరించారు. మైహోం రామేశ్వరరావు, హైదరాబాద్‌కు ల్యాండ్ మార్క్‌గా ఎదిగారని, స్వామి వారి అనుగ్రహంతోనే తాను ప్రతీ ఏడాది జరిగే కల్యాణోత్సవంలో పాల్గొనే అదృష్టం కలిగిందన్నారు. ఈ సందర్భంగా సంస్థల్లో 20 ఏళ్లు, 10 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు స్వామి వారి నుంచి బంగారు నాణెలు అందించారు. అనంతరం విశ్వవాసు నామసంవత్సర నూతన తెలుగు పంచాంగ క్యాలెండర్‌ను ఆవిష్కరించి, భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్వామి వారి తీర్థగోష్ఠిలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మైహోం గ్రూప్ చైర్మన డాక్టర్ జూపల్లి రామేశ్వరి, శ్రీకుమారి, మునగాల రాంమోహనరావు, అరుణ, వైస్‌చైర్మన జూపల్లి వినోద్‌రావు, భార్గవి, మేనేజింగ్ డైరెక్టర్ జూపల్లి రంజితరావు, రజిత, జూపల్లి రామురావు, మేఘన, చంద్రశేఖర్ పాండే, లక్ష్మీనారాయణ, ఎర్రబల్లి మురళీధర్‌రావు, కంపెనీ ప్రెసిడెంట్ ఎన శ్రీనివాసరావు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.