Share News

రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:57 PM

రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రే మేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ఉమ్మడి నల్లగొండ జిల్లా బీజేపీ కిసా న్‌ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతు సత్యాగ్రహం’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి

నల్లగొండ టౌన్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రే మేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ఉమ్మడి నల్లగొండ జిల్లా బీజేపీ కిసా న్‌ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతు సత్యాగ్రహం’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యాసంగి సీజన్‌ పూర్తి కావస్తున్నా ఇంకా రైతు భరోసా ఇవ్వలేదన్నారు. పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ చేయాలని, ప్రధానమంత్రి ఫసల్‌ భీమాను అమలు చేయాలని, ఎండిన వరి చేలకు ఎకరాని కి రూ.30వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చే శారు. పంటలు చేతికి వచ్చే వరకు సాగునీరు, విద్యుత్‌ కొరత లేకుండా చూడాలన్నారు. దొడ్డు రకం ధాన్యానికి సైతం రూ.500 బోనస్‌ ఇవ్వాలని, వరి కోత లు మొదలైనందున వెంటనే ఐకేపీ కొనుగో లు కేంద్రాలు ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు గడ్డం వెంకట్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగడి మనోహర్‌ రెడ్డి, నాయకులు గోలి మధుసూదన్‌రెడి,్డ బీజేపీ జిల్లా అధ్యక్షు డు నాగం వర్షిత్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతరెడ్డి, భువనగిరి జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌, పడమటి జగన్‌ మోహన్‌రెడ్డి, పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 11:57 PM