పోచంపల్లి ఇక్కత్ చీరల నకిలీలను అరికట్టాలి
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:24 AM
భువనగిరి (కలెక్టరేట్), మార్చి 27 (ఆంధ్ర జ్యోతి) : ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పోచం పల్లి ఇక్కత్ చీరల నకిలీలను అరికట్టి చేనేత రక్షణ కోసం రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి కోరారు.

ఈ మేర కు గురువారం కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు లేఖ రాశారు. లేఖ సారాంశానికి సంబంధించి పత్రిక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 30 వేలకు పైగా చేనేత మగ్గా లు ఉన్నాయని వాటిలో 15 వేల కు పైగా మగ్గాలు పోచంపల్లి చేనేత చీరలను తయారు చేస్తున్నారు. చేనేత రంగంలో పరో క్షంగా 50 వేల కుటుంబాలు ఆధారపడి జీవి స్తున్నారని, కొన్నేళ్లుగా మార్కె ట్‌లో నకిలీ పోచంపల్లి చీరల ప్రవేశంతో చేనేత వృత్తి ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. పోచం పల్లి చేనేత చీరలు మార్కెట్‌లో 10వేలు ఉంటే నకిలీ చీర 600కే విక్రయించడంతో నష్టపోతూ ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. 2004లో పోచంపల్లి ఇక్కత్ డిజైన్లకు భౌగోళిక గుర్తింపు కల్పించినప్పటికీ రక్షణ లేదన్నారు. నకిలీ చీరల ఉత్పత్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని, పోచంపల్లి ఇక్కత్ చీరలకు ప్ర త్యేక ట్యాగ్ ఏర్పాటు చేసి విరి విగా ప్రచారం చేయాలని కోరారు. నైపుణ్య రంగంలో భారత దేశం ముందుందని ప్రభుత్వం చెబుతున్నా చేతి వృత్తి కార్మికుల పనిలో నకిలీలతో ఆందో ళన కలిగిస్తున్నాయని వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు.