పండుగకు సన్నబియ్యం
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:31 AM
దేశానికే తలమానికమవుతుందని భావిస్తోన్న కీలక పథకం ఈ నెల 30న ఉగాది రోజున హుజూర్‌నగర్ నుంచి ప్రారంభం కాబోతోంది. రేషన్‌కార్డులున్న లబ్ధిదారులందరికీ ఆ రోజు నుంచి సన్నబియ్యాన్నే రేషన్ కింద అందించే ఈ పథకా న్ని సీఎం రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో ప్రారంభించబోతున్నారు.

పేదలకు నాణ్యమైనబియ్యం అందేలా రేషన్ అక్రమాలకు చెక్‌పెట్టేలా..
రాష్ట్రస్థాయిపథకాన్ని హుజూర్‌నగర్‌లో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఉమ్మడి జిల్లాలో సన్నబియ్యం కోసం రూ.857.76 కోట్ల వ్యయం
కొత్తకార్డులకూ ఏప్రిల్ నుంచి సన్నబియ్యం ఇస్తామన్న మంత్రి ఉత్తమ్
భారీ వ్యయంతో ఇస్తోన్న సన్నబియ్యాన్ని ప్రజలు దుర్వినియోగం చేయవద్దు : పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): దేశానికే తలమానికమవుతుందని భావిస్తోన్న కీలక పథకం ఈ నెల 30న ఉగాది రోజున హుజూర్‌నగర్ నుంచి ప్రారంభం కాబోతోంది. రేషన్‌కార్డులున్న లబ్ధిదారులందరికీ ఆ రోజు నుంచి సన్నబియ్యాన్నే రేషన్ కింద అందించే ఈ పథకా న్ని సీఎం రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో ప్రారంభించబోతున్నారు.
సన్న బియ్యం పథ కం అమలుకు ఏడాదికి రాష్ట్ర స్థాయిలో రూ.8వేల కోట్ల వరకు భారీగా వ్యయమవుతుందని అధికారులు అంచనావేశారు. అయినా పేదల కు ఆహారభద్రత కింద నాణ్యమైన బియ్యం ఇవ్వాలనే ధృడసంకల్పంతో ప్రభుత్వం ముందుకొచ్చింది. రేషన్ కిం ద సన్నబియ్యం ఇవ్వడం ద్వారా పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందడంతోపాటు, ప్రస్తుతం కొనసాగుతున్న రేషన్‌బియ్యం అక్రమదందా పూర్తిగా నిలిచిపోతుందని స్వయంగా మంత్రులు ఆశాభావం వ్యక్తం చేస్తుండ డం ఈపథకం విజయవంతం కావడంపై ప్రభుత్వం పెట్టుకున్న ఆశల్ని తెలియజేస్తోంది. ఈ పథకా న్ని పకడ్బందీ అమలు చేయడంకోసం ఇప్పటి కే అన్నివిధాల సన్నాహాలు పూర్తిచేసిన ప్రభు త్వం లోపాలు తలెత్తకుండా, పథకం ప్రారంభమయ్యాక మళ్లీ ఆగకుండా అవసరమైనంతమేర బియ్యాన్ని సైతం అందుబాటులో ఉంచింది.
ఉమ్మడి జిల్లాకు ఏడాదికి రూ.857.70 కోట్లు
ఏప్రిల్ నుంచి రేషన్‌కార్డులున్న ప్రతీ కుటుంబానికీ సన్నబియ్యమే ఉచితంగా అందుతుంది. ప్రతీ లబ్ధిదారుడి కి నెలకు ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 29,28,549 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ప్రతినెలా ఆరు కిలోల చొప్పు న సమీప రేషన్ దుకాణాల నుంచి సన్నబియ్యం అందుతుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఎంఎల్‌ఎస్ పాయింట్లకు అవసరమైన బియ్యాన్ని చేరవేశారు. వానాకాలం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్న సన్న ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లులకు ఇచ్చి అందులో దాదాపు సగం బియ్యాన్ని ఇప్పటికే జిల్లా స్థాయి గోదాములకు చేరవేయగా, ఏప్రిల్ కోటాకు సంబంధించి ఇప్పటికే ఎం ఎల్‌ఎస్ పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్‌దుకాణాలకు సన్న బియ్యం సరఫరా మొదలైంది. సన్నబియ్యాన్ని పేదలకు ఉచితంగా అందించేందుకు కిలోకు రూ.40 వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని మంత్రి ఉత్తమ్ పేర్కొనడంతో, ఈ బియ్యం కోసం ఎంత ఖర్చు పెడుతుందనే అంశంపై స్పష్టత వచ్చింది. ఉమ్మడి జిల్లానే పరిశీలిస్తే ప్రతి నెలా కనీసం 17,869 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను ప్రతినెలా రమారమి రూ.71.48 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. యేడాదికి కనీసం రూ.857.76 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చే యాల్సి ఉంటుంది.
కొత్త కార్డులకూ ఉగాది నుంచే సన్నబియ్యం
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇవ్వదల్చుకున్న రేషన్‌కార్డులకు, కొత్తగా నమోదైన లబ్ధిదారులకు సైతం ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని గురువారం హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనతో ఉమ్మడి జిల్లాలో కొత్త రేషన్‌కార్డులకు ఎదురుచూస్తున్న వారికి శుభవార్త చెప్పినట్లయింది. నల్లగొండ జిల్లాలో గతంలో మీసేవా ద్వారా ఏడువేల దరఖాస్తులు రాగా, ప్రజా పాలనలో అత్యధికంగా 1.25 లక్షల దరఖాస్తులొచ్చాయి. సూర్యాపేట జిల్లాలో ప్రజాపాలనలో దాదాపు 46,543 దరఖాస్తులు రాగా, మీసేవా కేంద్రాల ద్వారా 2వేల పైచిలుకు దరఖాస్తులొచ్చాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ ప్రజాపాలన కింద 32,352 దరఖాస్తులు రాగా, మీసేవ ద్వారా 680 దరఖాస్తులొచ్చాయి. వీటన్నింటిలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కసరత్తు సాగుతోంది. మంత్రి స్వయంగా ప్రకటించడంతో ఇందులో ఎంతమందికి కార్డుల జారీ చేస్తారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుండగా, ఏప్రిల్‌లో కొత్తకార్డుల పంపిణీ చేస్తారని భావిస్తున్నారు.
దుర్వినియోగం చేయవద్దు : ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ మంత్రి
దేశంలోనే ఎక్కడా లేని రీతిలో మొదటిసారిగా భారీగా వ్యయమవుతుందని తెలిసినా ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించే క్రమంలో సన్నబియ్యం ఇవ్వాలని సీఎం, నేను నిర్ణయించాం. ఏడాదికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.8వేల కోట్ల వరకు ఈ బియ్యానికి ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయినా వెనకాడకుండా నిర్ణయం తీసుకున్నాం. లబ్ధిదారులంతా ఈ విషయాన్ని గుర్తించి వారికిచ్చే సన్నబియ్యాన్ని దుర్వినియోగం చేయకుండా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. గత కొన్నేళ్లుగా రేషన్ బియ్యం కింద దొడ్డుబియ్యం, నాణ్యతలేని బియ్యం ఇచ్చారు. ఆ బియ్యాన్ని దాదాపు 90 శాతం వినియోగించకుండా ఇటు లబ్ధిదారులో, డీలర్లో ఏదో రకంగా బ్లాక్ మార్కెట్‌కు తరలించిన విషయం వాస్తవమే కదా..? వీటన్నింటికీ చెక్‌పెడుతూ రేషన్‌కింద ప్రజలు తినే సన్నబియ్యమే ఇవ్వాలని, ఎంతవ్యయమైనా వెనకాడవద్దని ఆలోచించి ఈపథకం ప్రవేశపెడుతున్నాం. ఇది ప్రజలదరికీ చేరి దేశానికి ఆదర్శంగా నిలిచేలా లబ్ధిదారులంతా సహకరిస్తారని ఆశిస్తున్నాం.
మిగతా 7వ పేజీలో...
జిల్లా రేషన్‌కార్డులు యూనిట్లు నెలవారీ కోటా
(మెట్రిక్‌టన్నుల్లో)
నల్లగొండ 4,66,522 13,85,506 8,878
సూర్యాపేట 3,05,564 8,79,000 4,750
యాదాద్రి 2,17,072 6,64,043 4,241
మొత్తం 9,89,158 29,28,549 17,869