Share News

ఒకే గొడుగు కిందికి మహిళా సంఘాలు

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:21 AM

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి మిషన్‌- 2025 కు వడివడిగా అడుగులు పడు తున్నాయి. అందులో భాగంగా పట్టణ, గ్రామీ ణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలకు ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు మెప్మాను సెర్ఫ్‌ లో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో నంబర్‌ 15ను జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని అన్ని స్వయం సహాయక సంఘాలను ఒకే ప్రభుత్వశాఖ పర్యవేక్షించనుంది. - (ఆంధ్రజ్యోతి -భువనగిరి టౌన్‌)

 ఒకే గొడుగు కిందికి మహిళా సంఘాలు

ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న పట్టణ, గ్రా మీణ మహిళా సంఘాలు ఒకే గొడుగు కిందికి చేరాయి. అయితే విలీన విధివిధానాలు, ప్రస్తుత మెప్మా సిబ్బంది ఉద్యోగ భద్రత తదితర అంశాలపై ప్రభుత్వం త్వరలో జారిచేసే మార్గదర్శకాలతోనే స్పష్టత రావల్సి ఉంది. అలాగే ప్రస్తుత స్వయం సహాయక సంఘాలకు అదనంగా కిశో ర బాలికల, వృద్ధ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. కాగా ఉమ్మడి జిల్లాలోని 19 మునిసిపాలిటీల్లో ప్రస్తుతం 15, 559మహిళాసంఘాలు కొనసాగుతుండగా వివిఽ ధ స్థాయిల్లో 560 మంది పట్టణ పేదరిక ని ర్మూలన సంస్థ (మెప్మా)లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే గ్రామీణ పేదరిక నిర్మూలన సం స్థ (సెర్ఫ్‌)ను విలీనం చేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 15 మార్గదర్శకాలపై ఆయా ఉద్యోగులలో ఉత్కంఠ నెలకొనది. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటి వరకు మెప్మా పర్యవేక్షణలో ఉన్న పట్టణ మహిళా సంఘాలు త్వరలోనే జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ పర్యవేక్షణలో ఉన్న సెర్ఫ్‌ పరిధిలోకి వెళ్లనున్నాయి. దీంతో మునిసిపాలిటీల కనుసన్నల్లో కొనసాగిన మెప్మాను సెర్ఫ్‌లో విలీనం చేస్తుండటంతో పట్టణ కార్యకలాపాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ జోక్యం నేరుగా పెరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నా రు. బ్యాంకు లింకేజీ రుణాలు తదితర స్వయం సహాయక సంఘాల సమస్యలపై ఇటీవల వరకు మునిసిపల్‌ కమిషనర్లను కలిసిన పట్టణ మహిళలు విలీన ప్రక్రియ పూర్తయ్యాక ఏ అధికారిని కలవాల్సి వస్తుందో తేలాల్సి ఉంది. అలాగే మెప్మా కార్యకలాపాలపై, సిబ్బంది విధు ల నిర్వహణపై మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశా ల్లో చర్చించే అవకాశాలు కొనసాగుతాయా? లేక ఆ అధికారాలు బదిలీ అవుతాయో తెలియాల్సి ఉంది. ఇక నుంచి మునిసిపల్‌ సమీక్ష సమావేశాలకు సెర్ఫ్‌ సిబ్బంది హాజరు కావాల్సి ఉంటుండగా మునిసిపల్‌ కార్యాలయాల్లో కొనసాగుతున్న మెప్మా విభాగం కొనసాగింపుపై కూడా తేలాల్సి ఉంది. మునిసిపాలిటీలోని టీఎల్‌ఎఫ్‌, ఎస్‌ఎల్‌ఎఫ్‌ కొనసాగింపు లేదా పేరు మార్పు, నిర్వహణ తీరు తదితర అం శా లు ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలతోనే స్సష్టత వస్తుంది.

కరువైన స్పష్టత

క్షేత్రస్థాయి మునిసిపల్‌ కార్యకలాపాల్లో కీలకంగా ఉండే మెప్మా ఆర్పీలపై యథావిధిగా మునిసిపాలిటీల ఆజమాయీషీ కొనసాగుతుం దా లేక వారి సేవల కోసం మునిసిపల్‌ అధికారులు గ్రామీణభివృద్ధి శాఖ లేక సెర్ఫ్‌ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందా తదితర అంశాలపై మునిసిపల్‌ యంత్రాంగంలో ఆసక్తి నెలకొనది. అయితే సెర్ఫ్‌ విలీనాన్ని మె ప్మా ఆర్‌పీలు స్వాగతిస్తున్నట్టు తెలుస్తోంది. మునిసిపాలిటీల్లో చేపట్టే ప్రతి సర్వేను చేయా ల్సి రావడం, స్వచ్ఛ సర్వేక్షణ్‌ హరితహారం తదితర అన్ని పనులను తామే చేయాల్సి వస్తుండటంతో పని భారం పెరుగుతుండటంతో పాటు మహిళా సంఘాల పనులను సకాలంలో చేయలేకపోతున్నామని ఆర్‌పీలు అంటున్నారు. విలీ న నిర్ణయంతో తాము సంఘాలకు మెరుగైన సేవలను సకాలంలో అందిస్తామని పేర్కొంటుండటం గమనార్హం. ముఖ్యంగా జిల్లా, పట్టణ స్థాయిలో పనిచేస్తున్న మెప్మా ఉద్యోగ భద్రత, వేత నాలపై ఆయా కుటుంబాల్లో ఆందోళన నెలకొనది.

కొత్తగా కిశోర బాలిక, వృద్ధ మహిళా సంఘాలు

మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా అన్ని మహిళా సంఘాలను ప్రభుత్వం ఒకే గొడుగు కిందికి చేర్చింది. నిరుపేద మహిళలకు వృత్తి ఉపాధి శిక్షణ, బ్యాంకు లింకేజీ రుణాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆదాయ మార్గాలను కల్పించేందుకు ఇందిరా మహిళా శక్తి మిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే మహిళా సంఘాలకు ప్రతి జిల్లాకు ఒక సోలార్‌ పవర్‌ యూనిట్‌, పెట్రోల్‌బంక్‌, ఆహార పదార్థాల నిర్వహణ కేంద్రాలు తదితర ఆదాయ వనరులను కల్పించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇప్పటివరకు 60 ఏళ్ల వయసుగల మహిళలకే స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలుగా ఉండే అర్హత ఉంది. కానీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం 15-18 ఏళ్ల బాలికలతో కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేసి 18 ఏళ్లు పూర్తయిన వెంటనే స్వయం సహాయక సంఘాలలో చేరే విధంగా అవకాశాలు కల్పించనున్నారు. 60 ఏ ళ్లు దాటిన మహిళలతో వృద్ధ మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయనున్నారు.

ఉమ్మడి జిల్లాలో సభ్యులు ..

ఉమ్మడి జిల్లాలోని 19 మునిసిపాలిటీల్లో ప్రస్తుతం 15,559 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 1.60 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. 548 ఎస్‌ఎల్‌ఎ్‌ఫలు, 23 టీఎల్‌ఎ్‌ఫలు ఉండగా 26 మంది జిల్లా, పట్టణస్థాయి ఉద్యోగులు ఉండగా 539 మంది రిసోర్స్‌ పర్సన్స్‌ (ఆర్‌పీ)లు విధులు నిర్వహిస్తున్నారు.

Updated Date - Mar 28 , 2025 | 12:21 AM