పేదలందరికీ పౌష్టికాహారం
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:26 PM
రాష్ట్రం లోని ప్రజాపాలన ప్రభుత్వంలో పేదలందరికీ నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేపట్టి పౌష్టికా హారం అందిస్తామని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు.

- ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్‌రెడ్డి,
బిజినేపల్లి/ తాడూరు/ తిమ్మాజిపేట/ ఊర్కొండ/ వంగూరు/ ఉప్పునుంతల/ చారకొం డ/ కొల్లాపూర్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రం లోని ప్రజాపాలన ప్రభుత్వంలో పేదలందరికీ నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేపట్టి పౌష్టికా హారం అందిస్తామని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు. బిజినేప ల్లిలోని 31వ రేషన్ షాపులో కలెక్టర్ బదావత్ సంతోష్‌తో కలిసి గురువారం సన్న బియ్యం పథ కాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి లబ్ధిదారులకు బియ్యం అందజేసి మాట్లాడారు. అలాగే మంగ నూర్‌లోని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పథకం ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్ర మంలో ఆర్డీవో సురేష్ కుమార్, తహసీల్దారు శ్రీరాములు, నాయబ్ తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో కతలప్ప, పంచాయతీ కార్యదర్శి మహేష్ నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మిద్దెరాములు, వెంకటస్వామి, అమృత్‌రెడ్డి, డీల ర్లు వెంకటేష్ గౌడ్, రంగ రాజు ఉన్నారు. ఫ తా డూరులో ఉచిత సన్నబియ్యం పంపిణీని ఎమ్మె ల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి లాంఛనంగా ప్రారం భించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మ న్ రమణారావు, ప్రజాప్రతినిధులు, ప్రభు త్వ అధికారులు, ఆర్డీవో, మండల నాయకులు, నా యకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.