Application Deadline: యువ వికాసం దరఖాస్తుల గడువు 14 వరకు పెంపు
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:37 AM
రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును 14వతేదీ వరకు పెంచారు.

హైదరాబాద్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును 14వతేదీ వరకు పెంచారు. ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు, ఈబీసీ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లయ్య భట్టు కోరారు.
దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వారు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని చెప్పారు. అలాగే 2016 తర్వాత మీ సేవ కేంద్రాల ద్వారా జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రంతో అభ్యర్థలు దరఖాస్తుచేసుకోవచ్చని సూచించారు. సమాచారం కోసం హెల్ప్ డెస్క్‌లను సంప్రదించాలని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..
For More AP News and Telugu News