Share News

Hyderabad: పండగలకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు..

ABN , Publish Date - Jan 03 , 2025 | 09:04 AM

సంక్రాంతి పండుగ(Sankranti festival), ఇతర పర్వదినాలకు సొంతూళ్లకు వెళ్లేవారికి ఆర్టీసీ శుభావార్త. జనవరి 7 నుంచి 15 వరకు 6,432 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఈ సారి మరో వెయ్యి బస్సులు, 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యాన్ని ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రకటన విడుదల చేసింది.

Hyderabad: పండగలకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు..

- లింగంపల్లిలో అందుబాటులో లేని రిజర్వేషన్‌ కౌంటర్‌

- ఆన్‌లైన్‌లో టికెట్‌ బుకింగ్‌కు ఇబ్బందులు

- ప్రైవేటు ఏజెంట్లపైనే ఆధారపడుతున్న ప్రయాణికులు

హైదరాబాద్: సంక్రాంతి పండుగ(Sankranti festival), ఇతర పర్వదినాలకు సొంతూళ్లకు వెళ్లేవారికి ఆర్టీసీ శుభావార్త. జనవరి 7 నుంచి 15 వరకు 6,432 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఈ సారి మరో వెయ్యి బస్సులు, 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యాన్ని ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రకటన విడుదల చేసింది. కానీ దూర ప్రయాణాలకు రిజర్వేషన్‌లు చేసుకునేందుకు కౌంటర్లను ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ పూర్తిగా విఫలమైయింది. దాదాపు తొమ్మిది లక్షల మంది జనాభా...

ఈ వార్తను కూడా చదవండి: Danam Nagender: గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటాలి


వేలాది ప్రయాణికులు, ప్రతీరోజు వందలాది జిల్లా బస్సులు తిరిగే శేరిలింగంపల్లి(Serilingampally)లో ఆర్టీసీ రిజర్వేషన్‌ కౌంటర్‌ లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు ఏజెంట్లపైనే ఆధారపడాల్సివస్తోంది. ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ సౌకర్యం ఉన్నప్పటికీ టికెట్‌ బుక్కింగ్‌కు పలువురు ఇబ్బంది పడుతున్నారు. గతంలో బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షి్‌ప, చందానగర్‌లో ఆర్టీసీ రిజర్వేషన్‌ కౌంటర్లు ఉండేవి. వాటిని మూసివేయడంతో నేరుగా రిజర్వేషన్లు చేసుకునేవారు పటాన్‌చెరు, కూకట్‌పల్లి(Patancheru, Kukatpally) వరకు వెళ్లాల్సివస్తోంది.


ప్రతీరోజు లింగంపల్లి నుంచి తెలుగురాష్ట్రాలకు రెండు వందలకు పైగా ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. పండగల సమయంలో అదనంగా మరో వేయ్యి బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నప్పటికీ రిజర్వేషన్‌ కౌంటర్లను ఏర్పాటు చేయడంలో రోడ్డు రవాణా శాఖ పూర్తిగా విఫలమైయిందనే వాదన వినిపిస్తోంది. లింగంపల్లి, బీహెచ్‌ఈఎల్‌(Lingampalli, BHEL) ప్రధాన బస్టాండ్లలో రిజర్వేషన్‌ కౌంటర్లను ఏర్పాటు చేసే సౌకర్యం ఉన్నప్పటికీ ఆర్టీసీ వారు ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆదాయ మార్గాలపైనే దృష్టి సారిస్తున్న ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యాలకు సైతం పట్టించుకోవాలని పలువురు కోరుతున్నారు.


సదుపాయాల కల్పనలో ఆర్టీసీ విఫలం

ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడంలో ఆర్టీసీ విఫలమైయింది. శివారు ప్రాంత ప్రజలు, ప్రయాణికులను విస్మరించి కేవలం ఆదాయ మార్గాలపైనే దృష్టి సారిస్తోంది. లింగంపల్లి నుంచి పుణ్యక్షేత్రాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య వేలల్లో ఉంటుంది. రిజర్వేషన్‌ కౌంటర్‌ లేకపోవడంతో పండగ వేళల్లో ప్రైవేటు ఏజెంట్లు టికెట్‌లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రధాన ప్రాంతాల్లో రిజర్వేషన్‌ కౌంటర్‌ను ఏర్పాటు చేయాలి.

- రాజునాయక్‌, కార్మిక సంఘం నాయకుడు


ఆన్‌లైన్‌తో ఇబ్బందులు

ఆర్టీసీ రిజర్వేషన్‌ కౌంటర్‌ లేకపోవడంతో ప్రయాణికులు ఆన్‌లైన్‌తో ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు టికెట్‌ ఖరారుకాక ముందే చార్జీలు కట్‌ అవుతున్నాయి. తిరిగి అకౌంట్‌లో మెల్లగా పడుతున్నాయి. వయోవృద్ధులు, మహిళలు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. బీహెచ్‌ఈఎల్‌లో ని రిజర్వేషన్‌ కౌంటర్‌ను తిరిగి తెరిచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలి.

- డేనియన్‌రాజ్‌, లింగంపల్లి నివాసి


ఈవార్తను కూడా చదవండి: Formula E Race: ఇదేం ఫార్ములా?

ఈవార్తను కూడా చదవండి: 765 చెరువుల ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు

ఈవార్తను కూడా చదవండి: అన్నదాతలకు రేవంత్‌ సున్నంపెట్టే ప్రయత్నం

Read Latest Telangana News and National News

Updated Date - Jan 03 , 2025 | 09:04 AM