Collector: అనుమతిలేని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Jan 25 , 2025 | 01:32 PM
అనుమతిలేని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, ఫిజియోథెరపీ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి(Collector Anudeep Durisetty) వైద్యాధికారులను ఆదేశించారు.

- వైద్యాధికారులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశం
హైదరాబాద్ సిటీ: అనుమతిలేని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, ఫిజియోథెరపీ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి(Collector Anudeep Durisetty) వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రైవేట్ క్లినిక్‌లు, ఆస్పత్రులను నడిపించే వ్యక్తులు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయంలో తప్పనిసరిగా రిజిస్ర్టేషన్ చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ వార్తను కూడా చదవండి: Union Minister: రేపు భారత మాతకు మహాహారతి
నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్(Clinic)లను నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ నూతన సంవత్సర క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్ కదిరివన్, అడిషనల్ డీసీపీ మనోహర్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకట్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీరంగ్ అబ్కారీ తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: మా కుమార్తెలా ఏ అమ్మాయీ మోసపోవొద్దు
ఈవార్తను కూడా చదవండి: మేడిగడ్డలో లోపాలను 2019లోనే గుర్తించాం
ఈవార్తను కూడా చదవండి: ఎవుసంపై కేసీఆర్ నజర్
ఈవార్తను కూడా చదవండి: Uttam: హరీశ్‌వి దగుల్బాజీ మాటలు
Read Latest Telangana News and National News