Telangana HC: వివేకా హత్య కేసు విచారణలో
ABN , Publish Date - Mar 22 , 2025 | 03:44 AM
ఈ వ్యవహారంలో నిందితులు సైతం స్పందించాలని స్పష్టంచేసింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి (అప్రూవర్), శివశంకర్‌రెడ్డి,

ట్రయల్ ప్రారంభం కాకపోవడానికి కారణాలేంటి?
సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు
నిందితులూ స్పందించాలని ఆదేశం
వారికి వ్యక్తిగత నోటీసులు పంపేందుకు సునీతారెడ్డికి అనుమతి
విచారణ 4 వారాలు వాయిదా
ఏడాదిన్నరగా సీఆర్పీసీ 207 దశలోనే
హార్డ్‌డి్‌స్కల్లో పత్రాలు ఓపెన్ కావడం లేదంటూ నిందితుల అడ్డుపుల్లలు
ఇలాగైతే ఏడేళ్లకూ విచారణ మొదలవదు
వెంటనే ట్రయల్ ప్రారంభించాలి
ఆరు నెలల్లో పూర్తిచేయాలి
ఆమె తరఫు న్యాయవాది అభ్యర్థన
హైదరాబాద్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో తీవ్ర జాప్యం ఎందుకు జరుగుతోంది.. ట్రయల్ ప్రారంభం కాకపోవడానికి కారణాలు ఏంటో సమాధానం చెప్పాలంటూ తెలంగాణ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంలో నిందితులు సైతం స్పందించాలని స్పష్టంచేసింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి (అప్రూవర్), శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిలకు వ్యక్తిగతంగా నోటీసులు పంపేందుకు వివేకా కుమార్తె, పిటిషనర్ సునీతారెడ్డికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. వివేకా హత్య కేసుకు సంబంధించి నాంపల్లి సీబీఐ కోర్టులో ఇంతవరకు ట్రయల్ ప్రారంభం కాలేదని.. ఏడాదిన్నరగా సీఆర్పీసీ 207 (నిందితులకు ప్రాసిక్యూషన్ పత్రాల కాపీలు అందజేయడం) దశలోనే ఉందని పేర్కొంటూ సునీతారెడ్డి గత నెలలో పిటిషన్ దాఖలు చేశారు.
ఇది తొలుత న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ ఎదుట విచారణకు వచ్చింది. ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని ఇప్పటికే నమోదైన సుమోటో పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం పర్యవేక్షిస్తున్నందున..
ఈ వ్యాజ్యాన్నీ అక్కడికే బదిలీ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో ఈ పిటిషన్ శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. సునీతారెడ్డి తరఫున న్యాయవాది ఎస్.గౌతమ్ వాదనలు వినిపించారు. ‘సీబీఐ సమర్పించిన హార్డ్‌డి్‌స్కల్లో 13 లక్షల పత్రాలుంటే.. అవి ఓపెన్ కావడం లేదని నిందితులు అడ్డుపుల్లలు వేస్తున్నారు. రోజుకు కొన్ని చొప్పున సీబీఐ కోర్టులో ఫైళ్లు ఓపెన్ చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఏడేళ్లయినా ట్రయల్ ప్రారంభం కాదు’ అని తెలిపారు. ఈ వ్యవహారంలో మీ ప్రధాన అభ్యర్థనేంటో చెప్పాలని ధర్మాసనం అడిగింది. వెంటనే ట్రయల్ ప్రారంభించి.. ఆరు నెలల్లో పూర్తిచేయాలని గౌతమ్ కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ముందు సీబీఐ, ఇతర ప్రతివాదుల (నిందితులు) స్పందన తెలుసుకుందామంటూ నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే