Share News

TPCC : తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి ఖాయం

ABN , Publish Date - Feb 18 , 2025 | 04:54 AM

తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తులో ఒక బీసీ వ్యక్తి.. బరాబర్‌ ముఖ్యమంత్రి అవుతాడని టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌ గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రానికి బీసీని సీఎం చేయడం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి బీసీ వ్యక్తి సీఎం అయ్యే

 TPCC : తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి ఖాయం

అది కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యం అవుతుంది.. ఈ ఐదేళ్లూ రేవంత్‌ రెడ్డే సీఎంగా ఉంటారు

వచ్చే ఎన్నికలు బీసీల చుట్టూనే తిరుగుతాయి

ఓబీసీ సెల్‌ కార్యవర్గ భేటీలో టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌ గౌడ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తులో ఒక బీసీ వ్యక్తి.. బరాబర్‌ ముఖ్యమంత్రి అవుతాడని టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌ గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రానికి బీసీని సీఎం చేయడం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి బీసీ వ్యక్తి సీఎం అయ్యే అవకాశం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో చక్కటి పాలన, కార్యక్రమాలను అందిస్తున్న రేవంత్‌రెడ్డి.. ఈ ఐదేళ్లూ సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు. అలాగే వచ్చే క్యాబినెట్‌ విస్తరణలో బీసీలకు తప్పకుండా ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికలు బీసీల చుట్టూనే తిరగనున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని టీపీసీసీ ఓబీసీ సెల్‌ కార్యవర్గ సభ్యులకు పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో సోమవారం టీపీసీసీ ఓబీసీ సెల్‌ విస్తృత కార్యవర్గ సమావేశం సెల్‌ చైర్మన్‌ నూతి శ్రీకాంత్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మహే్‌షకుమార్‌గౌడ్‌, ఏఐసీసీ ఓబీసీ సెల్‌ చైర్మన్‌ అజయ్‌సింగ్‌ యాదవ్‌లు పాల్గొన్నారు. ఓబీసీ సెల్‌ కార్యవర్గ సమావేశంలోనూ, అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ మహే్‌షకుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుల వృత్తులు క్రమంగా అంతరిస్తున్న పరిస్థితుల్లో బీసీలు ఎదగాలంటే పిల్లలను బాగా చదివించాలన్నారు. బీసీల పట్ల ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిలకు ప్రత్యేక శ్రద్ధ ఉందని కితాబునిచ్చారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలంటూ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ రాహుల్‌గాంధీ మాట్లాడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కులగణన నిర్వహించినందుకు రాహుల్‌, రేవంత్‌రెడ్డిలకు బీసీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకొంటున్నానన్నారు. ఎవరెంత జనాభా ఉంటే అంత ఫలాలు అందాలని పేర్కొన్నారు. మన నుంచి ఒకరికి అవకాశం ఇస్తే గెలిపించుకుందామన్న సోయి బీసీలకు ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీల్లో ఐక్యత మాయావతిని, బీసీల్లో ఐక్యత లాలూప్రసాద్‌ యాదవ్‌, నితీశ్‌కుమార్‌లను సీఎంలను చేసిందని గుర్తు చేశారు. తెలంగాణలోనూ బీసీల్లో ఐక్యత చాలా అవసరమన్నారు. మన అదృష్టం బాగుండి.. రాహుల్‌గాంధీ బీసీ నినాదాన్ని తీసుకున్నారని చెప్పారు. బీసీలకు 42ు రిజర్వేషన్‌ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లును పెట్టనున్నామని మహే్‌షగౌడ్‌ అన్నారు. దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలంటూ ప్రధా ని మోదీని అడిగే ధైర్యం బండి సంజయ్‌కు ఉందా అని ప్రశ్నించారు. అలాగే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనే సత్తా ఆయనకు ఉందా అని నిలదీశారు. రాష్ట్రంలోనూ తమిళనాడు తరహా రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ సహా అన్ని పార్టీల నేతలనూ కలుస్తామని ఆయన చెప్పారు.


స్థానిక ఎన్నికల్లో గెలుపు తప్పనిసరి

అధికారంలో ఉన్నాం కాబట్టి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలవడం తప్పనిసరి అని మహే్‌షకుమార్‌ గౌడ్‌ అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వాయిదాలకు ప్రతి నెలా రూ. ఆరున్నర వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని, జీతభత్యాలు పోను నెలకు రూ. 5 వేల కోట్లతో సర్దుకోవాల్సి వస్తుందని చెప్పారు. అయినా ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. ఈ వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి కార్యకర్తా రోజుకు పది మందికి ఈ విషయం చేరవేయాలన్నారు. జిల్లా అధ్యక్షులుగాను, రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నామనుకుంటే స్థానిక ఎన్నికల్లో టికెట్లు రావని, ప్రజల్లో ఉండి గెలిచే సత్తా ఉన్నవాళ్లకే టికెట్లు వస్తాయని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వడే కాకుండా.. అన్ని హంగులతో గెలిపించుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి మాటగా చెబుతున్నానన్నారు.

కులగణన.. ఓ గేమ్‌ ఛేంజర్‌: అజయ్‌సింగ్‌

తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన.. దేశానికే మార్గదర్శిని అయిందని, ఇది గేమ్‌ ఛేంజర్‌ కాబోతోందని అజయ్‌సింగ్‌ యాదవ్‌ అన్నారు. రాష్ట్రంలో కులగణన నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకొంటున్నామన్నారు. మహారాష్ట్ర, హరియాణాల్లో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య లో ఓట్ల సంఖ్య భారీగా పెరిగిదని, ఈ నేపథ్యంలో బ్యాన్‌ ఈవీఎం అనే నినాదాన్ని కాంగ్రెస్‌ ఎత్తుకుందని చెప్పారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు జరగాలన్నారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌తో 50 శాతానికి రిజర్వేషన్లు మించకూడదన్న నిబంధనను కేంద్రం ఇప్పటికే మీరిందని అన్నారు. అన్ని కులాలు, మతాలను గౌరవించే కాంగ్రెస్‌పైన ముస్లిం పార్టీ అని ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెహ్రూ నుంచి రాహుల్‌ వరకూ అందరూ హిందువులేనన్నారు.

Updated Date - Feb 18 , 2025 | 04:54 AM