ఎవరినీ వదల.. డేట్ టైం రాసుకోండి
ABN, Publish Date - Feb 25 , 2025 | 04:08 PM
Lokesh: గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలపై ఏపీ శాసనమండలి సాక్షిగా బయటపెడుతూ విరుచుకుపడ్డారు మంత్రి లోకేష్. ఎవరీ వదిలే ప్రసక్తే లేదని.. సీబీఐ ఎంక్వైరీ జరుగుతోందంటూ మంత్రి వార్నింగ్ ఇచ్చారు.
అమరావతి, ఫిబ్రవరి 25: ఏపీ శాసనమండలిలో (AP Legislative Council) వైసీపీ ఎమ్మెల్సీలకు (YSRCP MLCs) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh). బెదిరించే అలవాట్లు మాకు లేవని.. తాము పరదాలు కట్టుకుని తిరగమని అన్నారు. జడ్జిలను భయపెట్టడం, జడ్జిల భార్యలపై పోస్టుల పెట్టే నీచమైన సంస్కృతి తమది కాదన్నారు. అవన్నీ చేసింది గత ప్రభుత్వమే అంటూ విరుచుకుపడ్డారు. త్వరలోనే అన్నీ బయటకు వస్తాయని.. సీబీఐ ఎంక్వైరీ జరుగుతోందన్నారు. ఇప్పటికే ఒకరు జైల్లో ఉన్నారని.. ఎవ్వరినీ వదలిపెట్టమని స్పష్టం చేశారు.
ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. ‘‘వెయిట్ అండ్ వాచ్.. మార్క్ మై వర్డ్స్.. టైం.. డేట్ కూడా రాసుకోండి’’ అంటూ వైసీపీ నేతలనుద్దేశించి మంత్రి లోకేష్ సంచలన కామెంట్స్ చేశారు.
ఇవి కూడా చదవండి...
వైసీపీ సభ్యులకు చుక్కలు చూపించిన లోకేష్
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు.. ఆప్‌కు భారీ షాక్
Read Latest Telangana News And Telugu News
Updated at - Feb 25 , 2025 | 04:08 PM