Home » Andhra Pradesh » West Godavari
వేంకటేశ్వరస్వామి గర్భాలయం పసిడి కాంతులతో శోభిల్లుతోంది.
సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజె క్టు పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వందల కుటుంబాలు అనేక పాట్లు పడ్డాయి. పుట్టి పెరిగిన గ్రామంతో తెగతెంపులు చేసుకుని పిల్లాపాపలతో పునరావాస కాలనీలకు తరలి వెళ్లేందుకు సిద్ధపడ్డాయి.
పోలవరం ప్రాజెక్టు వద్ద పోలీసులపై తేనెటీగలు దాడి చేశాయి. సోమవారం రోజు పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టింది.
ఏలూరు రామకృష్ణాపురం రైల్వే బ్రిడ్జి 39వ పిల్లర్ వద్ద శనివారం ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో సంచలన విషయాలను పోలీసులు గుర్తించారు.
2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించేవారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్, అధికారుల నుంచి సమాచారం తెలుకునేవారు. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి ఆయన పోలవరానికి వెళుతున్నారు.
ప.గో. జిల్లా: మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం ఉదయం పాలకొల్లు సేవ్ గర్ల్ చైల్ఢ్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నేతలు, హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ నాగరాణి తదితరులు హాజరయ్యారు.
జగన్ పాలనలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ క్రమంలో పాలకొల్లులో ఆదివారం ఉదయం సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో 2కే రన్ ప్రారంభించారు. అనంతరం భారీగా బహిరంగ సభ నిర్వహించనున్నారు.
తల్లి మరణించడంతో తన ముగ్గురు ఆడ పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఉన్నకాడికి తాపీపనులు చేస్తూ తన పిల్లలను పోషించుకుంటున్నాడు.
సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సీఎం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు.