Home » Andhra Pradesh » West Godavari
చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న కొవ్వూరు–భద్రాచలం రైల్వే లైనుకు కేంద్రం తగినంత బడ్జెట్ కేటాయిం చింది. చిన్న మార్పులతోనే ఈ మార్గం పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటి వరకు సర్వేల పేరిట జరిగిన కాలయాపనకు స్వస్తి పలికింది. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించింది. భారీ అంచనా వ్యయంతో ప్రాజెక్టు మంజూరు చేస్తున్నట్టుగా రైల్వే మంత్రి రాజమహేం ద్రవరం ఎంపీ పురందేశ్వరికి రాత పూర్వకంగా తెలపడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ప.గో. జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సైతం ఫ్యాన్ పార్టీకి రాజీమానా చేశారు. వైసీపీ సభ్యత్వానికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు లేఖను అధిష్ఠానానికి పంపించారు.
ఉంగుటూరుకు చెందిన విశ్రాంత ఉమ్మడి ఏపీ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుంకవల్లి పర్వతరావు (90) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అతి కీలకమైన నూతన డయా ఫ్రం వాల్ నిర్మాణానికి అవసరమైన గైడ్ వాల్ పనులు ఊపందుకున్నాయి.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఉత్తేజం ఏమాత్రం తగ్గకుండా సభ్యత్వ నమోదులో తీసుకున్న చర్యలతో క్షేత్రస్థాయిలో సానుకూలత ఫలితాలు కనిపిస్తున్నాయి.
పట్టణానికి చేరువగా ఉండడం ఆ గ్రామాలకు శాపం. ఆయా గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించినా ప్రస్తుతం మునిసిపాల్టీలో లేవు.. ఇటు పంచాయతీ పాలకవర్గాలు కూడా లేవు..
వ్యాపారులు ప్రజలకు పరిశుభ్రమైన ఆహారాన్ని మా త్రమే అందించాలని, అపరిశుభ్రతపై చర్యలు ఉంటాయని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు.
రైతులు ధాన్యాన్ని నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటుతో పాటు.. 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ రైతులకు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను ఎగ్గొడితే, చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందన్నారు.
వరుస వాయుగుండాలు, అల్పపీడనాలతో సాగు పనులకు ఆటం కాలు కలుగుతున్నాయి. అయినప్పటికీ రైతులు ఇటు సార్వా మాసుళ్లు, అటు దాళ్వా నారుమడుల పనులను ముమ్మరంగా చేస్తున్నారు.
సాగు నీటి సంఘాల ఎన్నికలకు రంగం సిద్ధమైం ది ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లను పూర్తిచేసింది. బుధవారం కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.