Home » Arvind Kejriwal
Delhi ACB: ఆమ్ ఆద్మీ పార్టీ నేతల వ్యాఖ్యలపై ఢిల్లీ ఏసీబీ జెట్ స్పీడ్లో రియాక్ట్ అయింది. ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఇతర నేతల ఇళ్లకు ఏసీబీ అధికారులు వెళ్తున్నారు. అసలు హస్తినలో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చూద్దాం..
ఢిల్లీ శాసనసభలో మెజార్టీ ఏ పార్టీకి వస్తుంది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి. మెజార్టీ మార్క్ ఏ పార్టీకి దాటబోతుంది. హంగ్ వస్తే కాంగ్రెస్ కీలకంగా మారబోతుందా..
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా.. అందరి దృష్టి మూడే మూడు నియోజకవర్గాలపై నెలకొంది. ఆప్ నుంచి ముగ్గురు కీలక నేతలు పోటీ చేస్తుండటంతో ఆ మూడు నియోజకవర్గాలకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది.
ఢిల్లీలో 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం పలు సర్వే సంస్థలు ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను ప్రకటించబోతున్నాయి. ఈ సంస్థల అంచనా ఎలా ఉండబోతుంది.. కేకే సర్వే ఎలాంటి అంచనాలు ఇవ్వబోతుంది..
దేశరాజధాని ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 6 వరకూ పోలింగ్ జరగనుంది. ఉదయం 11 గంటల వరకూ దాదాపు 20 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి పోటీపడుతున్న ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ పోలీసులపై ఫైర్ అయ్యారు. ప్రతి 200 మీటర్లకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలు ఓటు వేయడానికి ఎలా వస్తారు? అని ఆరోపణలు చేసారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచే స్థానాలపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంచనా వేశారు. మహిళలు పూర్తి స్థాయిలో ఓటు వినియోగించుకుంటే మరిన్ని సీట్లు తథ్యమని చెప్పారు.
బీజేపీకి సీఈసీ లొంగిపోవడం చూస్తుంటే ఎన్నికల కమిషన్ తన అస్థిత్వం కోల్పోయినట్టు కనిపిస్తోందని కేజ్రీవాల్ సంచలన ఆరోపణ చేశారు. ఈ నెలాఖరులతో సీఈసీ రిటైర్ అవుతుండటంతో ప్రజల మనసుల్లో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు.
ఈసారి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. అందరినీ చితకబాదుతుందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం చివరి రోజున బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆప్ వలంటీర్లకు రక్షణ కల్పించాలని, కార్యకర్తలపై దాడులను నిలువరించడంలో విఫలమైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని కేజ్రీవాల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కు విజ్ఞప్తి చేశారు. దాడుల ఘటనలకు బాధ్యులైన బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయాలని కోరారు.
ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈరోజు నుంచి 'బచత్ పత్ర' ప్రచారాన్ని ప్రారంభించినట్టు తెలిపారు.