Delhi Assembly Elections: ఆప్ ఎన్ని సీట్లలో గెలుస్తుందో చెప్పేసిన కేజ్రీవాల్
ABN , Publish Date - Feb 03 , 2025 | 09:21 PM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచే స్థానాలపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంచనా వేశారు. మహిళలు పూర్తి స్థాయిలో ఓటు వినియోగించుకుంటే మరిన్ని సీట్లు తథ్యమని చెప్పారు.

న్యూఢిల్లీ: హోరాహోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగియడంతో ఫిబ్రవరి 5న జరిగే పోలింగ్ పైనే ప్రధాన పార్టీలు బలమైన ఆశలు పెట్టుకున్నాయి. గెలిచే స్థానాల పైనా నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తమ పార్టీ గెలిచే స్థానాలపై అంచనా వేశారు. 70 అసెంబ్లీ స్థానాల్లో 'ఆప్' 55 స్థానాల వరకూ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. ఢిల్లీ మహిళలు మరికొంత శ్రమ తీసుకుని పూర్తి స్థాయిలో ఓట్లు వేయడం, ఆప్‌ను గెలిపించాలని తమ భర్తలను ఒప్పించినట్లయితే 60 సీట్లకు పైనే గెలుచుకునే అవకాశం కూడా ఉందని అన్నారు.
Sonia Gandhi: సోనియాగాంధీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
''బీజేపీలో ఏమీ లేదనే విషయం మీ ఇంట్లోని పురుష ఓటర్లను ఒప్పించాలని తల్లులు, సోదరీమణులందరికీ విజ్ఞప్తి చేస్తు్న్నాను. బీజేపీ డబ్బున్నోళ్ల పార్టీ. కేజ్రీవాల్ మాత్రమే ప్రజల వైపు నిలబడతారు" అని కేజ్రీవాల్ కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గంలో చివరి నిమిషంలో పాల్గొన్న రోడ్‌షోలో అప్పీల్ చేశారు. ఢిల్లీ ఎన్నికలు మహిళా ప్రాధాన్యత ఉన్న ఎన్నికలని, మహిళలు చేయూతనిస్తే 60కి పైగా సీట్లలో ఆప్ గెలుస్తుందని, న్యూఢిల్లీ, జాంగ్‌పుర, కల్కాజీ సీట్లలో రికార్డు స్థాయి ఆధిక్యంతో పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో..
ఆమ్ ఆద్మీ పార్టీ 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లలో 67 సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టించింది. బీజేపీ 3 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. 2020 ఎన్నికల్లో ఆప్ మరోసారి తన ఆధిక్యతను చాటుకుంది. 62 సీట్లు గెలుచుకుంది. బీజేపీ తక్కిన 8 సీట్లు గెలుచుకుంది.
Microsoft: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు షాక్!
Cancer in India: దేశానికి క్యాన్సర్ సవాల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి