Delhi Assembly Elections 2025: స్వతంత్ర పరిశీలకులను నియమించండి.. ఈసీకి కేజ్రీవాల్ లేఖ
ABN , Publish Date - Feb 02 , 2025 | 03:28 PM
ఆప్ వలంటీర్లకు రక్షణ కల్పించాలని, కార్యకర్తలపై దాడులను నిలువరించడంలో విఫలమైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని కేజ్రీవాల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కు విజ్ఞప్తి చేశారు. దాడుల ఘటనలకు బాధ్యులైన బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయాలని కోరారు.

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు రోజులే ఉండటంతో పార్టీల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కార్యకర్తలపై దాడుల ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఎన్నికల కమిషన్ (EC)కు ఆదివారంనాడు లేఖ రాశారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. న్యూఢిల్లీ నియోజకవర్గానికి స్వతంత్ర పరిశీలకులను నియమించాలని ఈసీని కోరారు.
Ayodhya: రాజీనామా చేస్తా.. అయోధ్య ఎంపీ సంచలన ప్రకటన
ఆప్ వలంటీర్లకు రక్షణ కల్పించాలని, కార్యకర్తలపై దాడులను నిలువరించడంలో విఫలమైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని కేజ్రీవాల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కు విజ్ఞప్తి చేశారు. దాడుల ఘటనలకు బాధ్యులైన బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయాలని కోరారు. శనివారంనాడు రోహిణి ఏరియాలో జరిగిన బహిరంగం సభలో ఆప్ ఎమ్మెల్యే మొహిదర్ గోయల్‌పై దాడి జరిగిందన్నారు. సెక్టార్ 11లోని పాకెట్ హెచ్ నివాసులతో గోయెల్ మాట్లాడుతుండగా ఆయనపై దాడి జరిగినట్టు చెప్పారు.
న్యూఢిల్లీ నియోజకవర్గంలో ప్రచారం చేయకుండా ఆప్ కార్యకర్తలపై బీజేపీ వర్కర్లు దాడికి పాల్పడినట్టు రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సైతం ఎన్నికల కమిషన్‌కు శనివారంనాడు లేఖ రాశారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి