Delhi Elections: ఆప్ పథకాలతో ఒక్కో కుటుంబానికి రూ.25,000 సేవింగ్
ABN , Publish Date - Jan 31 , 2025 | 04:31 PM
ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈరోజు నుంచి 'బచత్ పత్ర' ప్రచారాన్ని ప్రారంభించినట్టు తెలిపారు.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆప్ ఆద్మీ పార్టీ (AAP) కొత్తగా 'బచత్ పత్ర' (Bachat Patra) ప్రచారాన్ని చేపట్టింది. ఇంటింటికి వెళ్లి 'ఆప్' పథకాల కింద ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరుతోంది, ఏమేరకు ఆదా అవుతోందనేది అంచనా వేయనుంది. ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) శుక్రవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈరోజు నుంచి 'బచత్ పత్ర' ప్రచారాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఆప్ పథకాల వల్ల ఢిల్లీలోని ఒక్కో కుటుంబానికి నెలకు రూ.25,000 చొప్పున ఆదా అవుతోందని, ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు బీజేపీ ఎన్నికల్లో తలపడుతోందని అన్నారు.
Economic Survey: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
ఆప్ ప్రభుత్వ పథకాల వల్ల రూ.25,000 చొప్పున ఆదా అవుతున్న కుటుంబాలు తిరిగి 'ఆప్' చీపురు గుర్తుకు ఓటేస్తే కొత్తగా హామీ ఇచ్చిన పథకాలతో మరో రూ.10,000 చొప్పున వారికి ఆదా అవుతుందని చెప్పారు. తమ వలంటీర్లు ఇంటికికి వెళ్లి తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత సంక్షేమ పథకాలతో ఏమేరకు ఆదా అవుతోందనే లెక్కలు రాసుకుంటారని తెలిపారు. సంక్షేమ పథకాలతో ఆయా కుటుంబాలకు మరింత సేవింగ్స్ పెరిగేందుకు ఆప్ మేనిఫెస్టోలో విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణాలు, మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు.
రెండు బడ్జెట్లకు తేడా అదే..
కేంద్రం బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతున్న బడ్జెట్ పెడుతున్న నేపథ్యంలో ఆప్ విధానాలు, బీజేపీ విధానాలకు ఉన్న తేడాను కేజ్రీవాల్ వివరించారు. బడ్జెట్‌తో సహజంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని, కుటుంబాలపై ఆర్థిక ప్రభావం చూపుతుందని అన్నారు. కానీ, ఆప్ ప్రభుత్వం కుటుంబ సేవింగ్స్‌కే ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు కల్పిస్తున్న (ఆప్) ప్రయోజనాలన్నింటినీ నిలిపివేస్తామని పదేపదే చెబుతోందని అన్నారు. ప్రజాసంక్షేమానికి తాము బడ్జెట్‌ను వినియోగిస్తామని, ఇందుకు భిన్నంగా ప్రజాధనాన్ని కార్పొరేట్ మిత్రులకు బీజేపీ ధారాదత్తం చేస్తుంటుందని ఆరోపించారు. ముంబలో ధారవి భూములను తమ అసోసియేట్లకు అప్పగించిందని, ఢిల్లీలో కూడా భూములను సొంతం చేసుకుని ప్రజలకు మొండిచేయి చూపించాలనుకుంటోందని ఆరోపించారు.
పోరాటం వల్లే కోటి మందికి నీళ్లొచ్చాయి..
జనవరి 15న ఢిల్లీకి సరఫరా చేసిన నీటిలో అమ్మోనియా క్వాంటిటీ 3.22 పీపీఎం నుంచి 7 పీపీఎంకు పెంచారని, తనతో పాటు ఢిల్లీ ప్రజలు చేసిన పోరాటం వల్ల అమ్మోనియా క్వాంటిటీ 7 నుంచి 2.1 పీపీఎంకు తగ్గిందని చెప్పారు. సమష్టి పోరాటం చేయనట్లయితే ఈరోజు కోటి మంది ఢిల్లీ ప్రజలకు జలాలు వచ్చేవి కావని అన్నారు. ఢిల్లీ ప్రజలను అప్రతిష్టపాలు చేసేందుకు జరిగిన కుట్ర ఇదని తెలిపారు.
ఇవి కూడా చదవండి
PM Modi: వికసిత్ భారత్‌కు ఊతమిచ్చేలా బడ్జెట్
Parliament: శీతాకాల సభల్లో సెగలే!
Read Latest National News And Telugu News