Asaduddin Owaisi: వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం: ఒవైసీ
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:58 AM
రాజ్యాంగ వ్యతిరేక వక్ఫ్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలు అంగీకరించరని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదానికి బీజేపీకి అవసరమైన మెజారిటీ లేదని చెప్పారు.

హైదరాబాద్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ వ్యతిరేక వక్ఫ్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలు అంగీకరించరని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదానికి బీజేపీకి అవసరమైన మెజారిటీ లేదని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీశ్‌కుమార్, కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, జయంతి చౌదరి మద్దతుతో వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతంచేసేందుకు తెచ్చిన లుటేరా (ఆస్తులు అపహరించే) బిల్లు.. వక్ఫ్ సవరణ బిల్లు అని పేర్కొన్నారు.
హిందూ ఆలయ కమిటీల్లో హిందువులు, గురుద్వార కమిటీల్లో సిక్కులు, క్రైస్తవ ట్రస్టుల్లో క్రైస్తవులే సభ్యులుగా ఉండాలనే నిబంధనను అమలు చేస్తున్న నేపథ్యంలో వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఎలా ఉంటారని నిలదీశారు. ముస్లింల ఆస్తులు, వక్ఫ్ ఆస్తులను కాజేయడానికే కేంద్రం.. రాజ్యాంగ వ్యతిరేకమైన వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చిందని ఒవైసీ విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..
GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు
Read Latest Telangana News And Telugu News