Home » Chennai News
తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ జిల్లాలో రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా అరటి తోటలు దెబ్బతిన్నాయి. అలాగే.. తిరుప్పూరులో కురిసిన భారీ వర్షాలకు ఇద్దరు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.
ఈనెల 12వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఈ నెల 12 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
చెన్నైలో ఉన్న ఆ షాప్‌లోకి అడుగు పెట్టగానే... ఒకప్పటి ఫస్ట్‌లైన్ బీచ్ వీధి, మద్రాస్ సెంట్రల్ రైల్వేస్టేషన్, మౌంట్ రోడ్, మెరీనా బీచ్... మొదలైన ఒకప్పటి మద్రాస్ ఛాయాచిత్రాలు సందర్శకులకు స్వాగతం పలుకుతాయి. ఇక షాపు లోపల పూర్తిగా పురాతన వస్తువులే.
నీట్.. మరొకరిని బలిగొన్నది. డాక్టర్ కావాలన్న తన కోరిక నెరవేరదనే భయంతో ఓ విద్యార్థిని విషం తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.
కారు పార్కింగ్ విషయంలో బిగ్‌బాస్ ఫేమ్, నటుడు దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తి కుమారుడు, ఆయన భార్య, అత్తతో దర్శన్ గొడవకు దిగి వారిపై దాడికి పాల్పడ్డాడని అందిన ఫిర్యాదుతో పోలీసులు దర్శన్‌ను అరెస్ట్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్ సెల్వం భేటీ కానున్నారు. రామనాథపురం జిల్లాలో పాంబన్ వంతెన ప్రారంభోత్సవానికి ఆదివారం ప్రధాని మోదీ విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు మాజీ సీఎంలు ప్రధానితో భేటీ కానున్నారు.
ప్లీజ్.. అన్నామలైని మార్చొద్దు.. ఆయన వచ్చాకే పార్టీ చాలా డవలప్ అయింది.. అంటూ నగరంలో పలుచోట్ల వాల్‌పోస్టర్లు వెలిశాయి. అన్నామలైని మారుస్తున్నారంటూ ఇటీవల ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఈ నేపధ్యంలో ఆయనను మార్చొద్దంటూ నగరంలో పలుచోట్ల ఈ వాల్‌పోస్టర్లు వెలవడం ఇప్పుడు చర్చానీయాంశమైంది.
ఆన్లైన్ రమ్మీకి మరోకరు బలయ్యారు. ఈ ఆన్లైన్ రమ్మీ పుణ్యమాని ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది. వేలూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఈ ఆన్లైన్ రమ్మీలో రూ.50 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆర్ధికంగా చితికిపోయిన ఆయన మనోధైర్యం కోల్పోయి చివరకు తనువు చాలించాడు.
చెన్న మహానగరంలో కార్ల్ మార్క్స్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి’ అంటూ పిలుపునిచ్చి సోషలిస్టు భావాలను వ్యాపింపజేసిన ప్రముఖ సోషలిస్టు విప్లవకారుడు, సామాజిక వేత్త కార్ల్మార్క్స్ను భావితరాలు గుర్తుంచుకోవాలని సీఎం అన్నారు.
రామేశ్వరం నగరాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ నెల 6వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామేశ్వరం విచ్చేస్తున్న నేపథ్యాన్ని పురష్కరించుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.