Home » Crop Loan Waiver
రెండో విడత రుణమాఫీకి ముహూర్తం ఖరారైంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు రెండో విడత రుణమాఫీ నగదు బదిలీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. అసెంబ్లీ ఆవరణలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ నెలాఖరు (ఎల్లుండి)లోగా రైతులకు రూ.1.50 లక్షల రుణాలను మాఫీ చేసి, తమ నిబద్ధతను చాటుకుంటామని తెలిపారు.
తొలి విడత రుణమాఫీ నిధులను ఈనెల 18 తేదీన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం... రెండో విడత నిధులను ఈనెల 31వ తేదీన విడుదలచేసే అవకాశాలున్నాయి. రూ.లక్ష వరకు అప్పున్న రైతులకు రూ. 6,099 కోట్లు విడుదలచేయగా లక్షన్నర వరకున్న అప్పులు మాఫీచేయటానికి మరో రూ.7 వేల కోట్ల నిధులు అవసరమవుతున్నాయి.
రుణమాఫీపై రైతులెవ్వరూ ఆందోళన చెందొద్దని, రూ.2లక్షల రుణమాఫీ అందరికీ అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష లోపు రుణమాఫీపై క్షేత్ర స్థాయిలో కొంత గందరగోళం నెలకొంది. రుణమాఫీ జాబితాలో పేరు ఉండి.. మాఫీ సొమ్ము ఖాతాలో పడనివారు కొందరైతే, మాఫీకి అర్హత ఉండి జాబితాలో పేరు రానివారు మరికొందరు గందరగోళానికి గురవుతున్నారు.
కాంగ్రెస్ సర్కారు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీశ్‌రావు తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
రైతు బంధు కింద జూన్‌లో వారికి ఇవ్వాల్సిన నిధుల్లో నుంచి రూ.7,000 కోట్లను రేవంత్ సర్కారు రుణమాఫీకి మళ్లించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు తెలిపారు.
రైతులకు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. కాంగ్రెస్ శ్రేణులు, రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
రుణమాఫీ పథకంలో భాగంగా తొలి విడతలో లక్ష రుణ మాఫీ ప్రక్రియలో నల్లగొండ నుంచి అత్యధిక మొత్తంలో రుణాలు మాఫీ అయ్యాయి.
రైతు రుణ మాఫీ కింద వచ్చిన నిధులను బ్యాంకర్లు జమ చేసుకొని... భవిష్యత్తు అవసరాల కోసం రైతులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.