Minister Dola: జనం ఛీత్కరించినా మారని జగన్ తీరు
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:27 AM
ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని జనం ఛీత్కరించినా ఆయన తీరు ఏమాత్రం మారలేదని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు.

మేం గూండాలం కాదు, చిన్నాన్నను చంపలేదు: మంత్రి డోలా
ఒంగోలు, కార్పొరేషన్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని జనం ఛీత్కరించినా ఆయన తీరు ఏమాత్రం మారలేదని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. ఆదివారం ఒంగోలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో గుంటూరు మిర్చి యార్డ్‌కు వెళ్లిన జగన్.. పక్కనే ఉన్న రైతులు ఏం మాట్లాడారో తెలియకుండా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గు చేటన్నారు. జగన్ యార్డుకు వెళ్లకముందే సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి, మిర్చి రైతులకు గిట్టుబాటు ధరల కల్పన విషయమై కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారని, దీనిపై కేంద్రం స్పందించి రైతులను ఆదుకుంటామని హామీ కూడా ఇచ్చిందని తెలిపారు. అసెంబ్లీకి రావడానికి భయపడటం లేదని జగన్ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి స్వామి ఘాటుగా స్పందించారు. మేము రౌడీలం, గూండాలం కాదని.. చిన్నాన్నను చంపలేదని.. మమ్మల్ని చూసి ఆయన భయపడాలని మేము కోరుకోవడం లేదని వ్యగ్యంగా వ్యాఖ్యానించారు.