Share News

AP Ministers on Jagan: జగన్ గుంటూరు మిర్చియార్డు పర్యటనపై మంత్రుల ఆగ్రహం

ABN , Publish Date - Feb 19 , 2025 | 02:46 PM

AP Ministers: మాజీ సీఎం వైస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదన్నారు మంత్రి కొల్లురవీంద్ర. జగన్ ఐదేళ్ల పాలనలో 14 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు.

AP Ministers on Jagan: జగన్ గుంటూరు మిర్చియార్డు పర్యటనపై మంత్రుల ఆగ్రహం
AP Ministers

ప్రకాశం, ఫిబ్రవరి 19: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohah Reddy) ఈరోజు గుంటూరు మిర్చియార్డుకు వెళ్లి రైతులను కలిశారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉందని, మిర్చియార్డులోకి అనుమతి లేదని అధికారులు చెప్పినప్పటికీ లెక్క చేయకుండా ప్రవర్తించారు జగన్. అంతేకాకుండా ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. దీంతో జగన్ మిర్చియార్డు పర్యటనపై రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం గుంటూరు మిర్చి యార్డు పర్యటన పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో 14 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు.


రైతుల ఆత్మహత్యలో దేశంలో ఏపీని మూడో స్థానంలో జగన్ నిలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో ఎన్నికల కోడ్ ఉందని చెప్పినా... జగన్ మిర్చి యార్డుకి వెళ్లారన్నారు. దుర్మార్గమైన కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అప్రదిష్టపాలు చెయ్యాలని చూస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వంలో నిలిపేసిన పోలవరం పనులు సీఎం చంద్రబాబు పరుగులు తీయిస్తున్నారని తెలిపారు. దళితుడు సత్యవర్ధన్‌పై దాడి ఘటనలో నిందుతుడైన వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారని.. పోలీసులను, అధికారులను భయపెట్టే విధంగా జగన్ మాట్లాడారని అన్నారు. ఐదేళ్లు చేసిన దుర్మార్గ కార్యక్రమాల వల్లే బట్టలు ఊడదీసి 11 సీట్లు ఇచ్చారని.. ఇలాగా ఉంటే 11 సీట్లు కూడా రావంటూ ఎద్దేవా చేశారు.

ఢిల్లీ సీఎం ఆమేనా.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..!


జగన్‌కు రెడ్ బుక్ ఫోబియా పట్టుకుందన్నారు. రెడ్ బుక్ పేరు వింటే వైసీపీ నాయకులకు తడిసిపోతుందన్నారు. రెడ్ బుక్ తెరిస్తే ప్రభుత్వం వచ్చిన నెలలోనే వైసీపీ నాయకులు ఇళ్లలో ఉండేవాళ్లు కాదన్నారు. జీవితాన్ని ఇచ్చిన తెలుగు దేశం పార్టీ కార్యాలయాన్ని వంశీ తగులబెట్టారని విమర్శించారు. సత్యవర్థన్‌ను వంశీ, ఆయన అనుచరులు బెదిరించి తీసుకువెళ్తున్న వీడియోలు బయటకు వచ్చాయన్నారు. మద్యం విధానంలో దందాలు చేసి తాడేపల్లి ప్యాలెస్‌కు లక్ష కోట్లు నిధులు మళ్లించారని ఆరోపించారు. మద్యంలో జరిగిన అక్రమాలపై సిట్ వేస్తే... తాడేపల్లి ప్యాలెస్ వద్ద ఫైల్స్ అన్నీ తగులబెట్టారన్నారు. జగన్ అక్రమ మద్యం విధానం వల్ల లక్షల మంది లివర్, కిడ్నీ వ్యాధుల బారిన పడ్డారని వెల్లడించారు. జగన్ విపరీతంగా మద్యం ధరలు పెంచడంతో నాటు సారాకు అలవాటుపడ్డారన్నారు. నాటు సారా నివారణ కోసం నవోదయం కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఐదేళ్ల దోపిడీ కోసం జగన్ పాలసీ తీసుకువస్తే... ప్రజల ఆరోగ్యం కోసం ఎక్సైజ్ పాలసీ తీసుకువచ్చామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.


జగన్ పని అయిపోయింది: బాలవీరాంజనేయస్వామి

bala-veeranjaneya-swamy.jpg

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు విషయంలో జగన్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి బాలవీరాంజనేయ స్వామి అన్నారు. వైసీపీకి చెందిన దళిత నాయకులు జైలులో ఉంటే జగన్ వెళ్లలేదన్నారు. గుంటూరులో ఎన్నికల కోడ్ అమలులో ఉందని.. అయినా మిర్చి యాడ్‌కు వెళ్లి జగన్ న్యూసెన్స్ చేశారని మండిపడ్డారు. రైతులపై ప్రేమ ఉన్నట్టు జగన్ మాట్లాడుతున్నారన్నారు. రైతు భరోసా నిధులు కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జగన్ మోసం చేశారన్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని తెలిపారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకుంది ఎన్డీఏ ప్రభుత్వమని వెల్లడించారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరన్నారు. అన్ని విధాలుగా జగన్ తిరస్కరణకు గురయ్యారు కాబట్టే 11 సీట్లు వచ్చాయన్నారు.


ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన జగన్‌ను, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసి జైలుకి పంపాలని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను కూడా జగన్ అసెంబ్లీకి పంపడం లేదన్నారు. గతంలో అసాంఘికంగా చెలరేగిన వారిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అరెస్టులు జరుగుతున్నాయని చెప్పారు. పోలీసులను బట్టలు ఊడదీసి కొడతామని జగన్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సప్త సముద్రాలు జగన్ దాటాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలన్నారు. సప్త సముద్రాలు దాటే శక్తి జగన్‌కు లేదని...జగన్ పని అయిపోయిందన్నారు. జగన్‌కు మళ్లీ అధికారం అందని ద్రాక్ష అని మంత్రి బాలవీరాంజనేయ స్వామి వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి..

బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Mahashivaratri: వైభవంగా మల్లన్న బ్రహ్మోత్సవాలు..

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 19 , 2025 | 02:46 PM