Home » Nagarjuna Sagar
కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నిండటంతో.. వాటి కింద ఉన్న ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొద్ది రోజులుగా ఎగువ నుంచి కృష్ణమ్మకు భారీగా వరద వస్తుండటంతో జలాశయాలన్నీ నిండు కుండలా మారాయి.
కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం నుంచి ఆల్మట్టి దాకా ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చిచేరుతోంది. ప్రధానంగా శ్రీశైలాన్ని నింపి.. నాగార్జునసాగర్ దిశగా కదులుతున్న కృష్ణవేణి ఆ ప్రాజెక్టును కళకళలాడిస్తోంది. వరద క్రస్ట్ గేట్లను తాకింది.
కృష్ణా ప్రవాహానికి శ్రీశైలం పూర్తిగా నిండి.. పది గేట్ల నుంచి భారీగా నీళ్లు విడుదల చేయడంతో నాగార్జునసాగర్ కూడా జలసిరితో కళకళలాడుతోంది. వారం రోజుల్లో సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కృష్ణమ్మ ఉధృతికి నాగార్జున సాగర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం నుంచి 8 గేట్ల ద్వారా 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు సగానికి పైగా నిండింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ప్రజలు ఎంత బాగా ఆశీర్వదించారో రాష్ట్రాన్ని కూడా ప్రకృతి అదే విధంగా దీవిస్తోందని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ఏపీలో జలకళ సంతరించుకుందని ఆయన చెప్పారు.
తమను సంప్రదించకుండానే నాగార్జున సాగర్ కుడికాలువ నుంచి 3 టీఎంసీల నీటి విడుదలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.
కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (కేజీఎఫ్) తొలి సదస్సు ఇక్కడి హెచ్ఐసీసీలో శనివారం ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభించనున్నారు.
నాగార్జునసాగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో(Oxford School) ఈనెల 23న జరిగిన రెహమాన్(Rahman) హత్య కేసును విజయపురి పోలీసులు(Vijayapuri police) ఛేదించారు. నిందితుడు శివసాయిరెడ్డిగా గుర్తించి అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. ఇద్దరి మధ్య గొడవే హత్యకు దారి తీసినట్లు ఆయన వెల్లడించారు.
వానాకాలం వరద సీజన్‌కు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉన్నందున నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కేఆర్ఎంబీ( కృష్ణానది యాజమాన్య బోర్డు) ఛైర్మన్ అశోక్ గోయల్ అధికారులకు సూచించారు.
రాష్ట్రంలోని బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.