Home » Rohit Sharma
వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరగబోతోంది. ఈ నేపథ్యంలో చాలా ఫ్రాంఛైజీలు ఎన్నో ఏళ్లుగా తమ జట్టుతో పాటు ఉన్న కీలక ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్ధమవుతున్నాయి. బీసీసీఐ ఇంకా రిటెన్షన్ నిబంధనలను వెల్లడించలేదు. ఎంత మంది పాత ఆటగాళ్లను తమతో ఉంచుకోవచ్చు అనే విషయంలో ఆయా ఫ్రాంఛైజీలకు క్లారిటీ లేదు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో ఉన్నప్పుడు ఎంత సీరియస్‌గా ఉంటాడో, డ్రెస్సింగ్ రూమ్‌లో అంత సరదాగా ఉంటాడు. తోటి ఆటగాళ్లను ఆట పట్టిస్తూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడు. తాజాగా అలాంటి ఓ ఫన్నీ సీన్ కెమెరా కళ్లకు చిక్కింది.
Rohit Sharma: భారత క్రికెట్ టీమ్ బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధం అవుతోంది. తొలి మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..
మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ముగ్గురు భారత క్రికెట్ దిగ్గజాలు. దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. వీరి నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు. మరి వీరి ముగ్గురిలో ఇష్టమైన ఆటగాడు ఎవరు? అంటే సమాధానం చెప్పడం అంత సులభం కాదు.
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ అయ్యాక టీమిండియా స్వరూపమే మారిపోయింది. అన్ని ఫార్మాట్లలోనూ నెంబర్ వన్ టీమ్‌గా ఎదిగింది. 2007, 2011 ప్రపంచకప్‌లు, రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు సాధించింది. అలాగే టెస్ట్ ఫార్మాట్లోనూ మెరుగ్గా ఆడింది. ఆ తర్వాత ధోనీ నుంచి కోహ్లీ పగ్గాలు అందుకున్నాడు.
రోహిత్ శర్మ పంజాబ్ జట్టు తరఫున ఆడతారనే ఊహాగానాలు వచ్చాయి. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడతారని ప్రచారం జరుగుతోంది. మరో అడుకు ముందుకేసి రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు లక్నో జట్టు రూ.50 కోట్లు కేటాయించిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈసారి IPL 2025 కోసం మెగా వేలం నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెటరన్ ప్లేయర్లు, కోచ్‌ల కోసం ఆయా ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాకు టీ20 టైటిల్‌ను అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వచ్చే సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది.
టీమిండియా అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని ప్రపంచకప్ మ్యాచ్ 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్. ఆ సెమీస్ మ్యాచ్‌లో ఓటమి భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా ఎంఎస్ ధోనీ రనౌట్ ఆ మ్యాచ్‌లో పరాజయానికి కారణమైంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వ పటిమపై మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో విక్రమ్ మాట్లాడుతూ రోహిత్‌ను గొప్ప కెప్టెన్‌గా అభివర్ణించాడు.
జాతీయ జట్టు తరఫున ఆడుతున్న ప్రముఖ క్రికెటర్లు కూడా దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలని బీసీసీఐ ఎప్పట్నుంచో ఒత్తిడి తీసుకొస్తుంది. దేశవాళీ ట్రోఫీలకు దూరంగా ఉంటున్న క్రికెటర్లను కాంట్రాక్టులు కూడా ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 5వ తేదీ నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభం కాబోతోంది.