Home » Srikakulam
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారశైలి ఆది నుంచీ వివాదస్పదమే. దూకుడు స్వభావం, నోటిదురుసు, వివాదస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. దీని మూలంగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల ద్వారా టెక్కలి జడ్పీటీసీ మినహా మరే ఇతర పదవులను అందుకోలేకపోయారు. రాజకీయంగా తొలుత..
Andhrapradesh: శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తుపాకీ లైసెన్స్‌కు దరఖాస్తు చేశారు. తన దగ్గర తుపాకీ ఉందని.. దానికి లైసెన్స్ ఇవ్వాలని కోరుతూ ఎస్పీ మహేందర్ రెడ్డికి ఈనెల 7న దువ్వాడ దరఖాస్తు చేసుకున్నారు. తనకు కొంత మంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రచ్చకెక్కింది. గురువారం రాత్రి ఆయన ఇంటిముందు కుమార్తెలు నిరసనకు దిగారు. తమ తండ్రి బయటకు రావాలంటూ మౌనపోరాటానికి దిగారు.
శ్రీకాకుళం జిల్లా పేరు చెప్పగానే గుర్తొచ్చే రాజకీయ నాయకులు కొందరు ఉంటారు. ప్రస్తుత రాజకీయాల్లో మొదట వరుసలో ఉండేది కింజరాపు కుటుంబమైతే.. రెండో వరుసలో ఉండేది ధర్మాన కుటుంబం.
శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో ఇంటర్ విద్యార్థిని అర్చిత(Archita) ఆత్మహత్య ఘటనపై విచారణకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఆదేశాలు జారీ చేశారు. బలవన్మరణానికి గల కారణాలపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఆ క్రమంలో ఉత్తరాంద్రలోని శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా కె.వి. మహేశ్వర్ రెడ్డిని నియమించింది.
Andhrapradesh: శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష న్యాయ పోరాటానికి దిగారు. గతంలో వైసీపీ సోషల్ మీడియా వేదికగా జరిగిన వేధింపులపై న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న తన మీద తన కుటుంబం మీద రాసిన అశ్లీల , అసభ్యకర రాతలు మీద పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో శిరీష న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎయిర్‌లైన్ హబ్‌గా మారుస్తామని పౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు వెల్లడించారు.
శ్రీకాకుళం: ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని, కొన్ని శాఖల అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కక్ష సాధింపులు ఉండవని వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
కువైట్‌లోని మంగ్‌ఫలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు దుర్మరణంపాలయ్యారు. తెలంగాణకు చెందిన మరో ముగ్గురు అగ్నికీలలు, దట్టమైన పొగను తప్పించుకునేందుకు భవనం పైనుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 50 మంది మృతిచెందగా..