Share News

Srikakulam: బాబోయ్ దారుణం.. హాస్టల్‌లోకి అక్రమంగా ప్రవేశించి.. విద్యార్థినిపై..

ABN , Publish Date - Jan 31 , 2025 | 08:56 AM

శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్‌లోకి గుర్తుతెలియని దుండగులు గురువారం రాత్రి 8 గంటల సమయంలో అక్రమంగా ప్రవేశించారు. బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న హాస్టల్ విద్యార్థినిపై హాస్టల్ ప్రాంగణంలో దారుణానికి ఒడిగట్టారు.

Srikakulam: బాబోయ్ దారుణం.. హాస్టల్‌లోకి అక్రమంగా ప్రవేశించి.. విద్యార్థినిపై..
Srikakulam

శ్రీకాకుళం: దేశవ్యాప్తంగా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆడవారు కనిపిస్తే చాలు అత్యాచారాలు, హత్యాచారాలతో బరితెగిస్తున్నారు. చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకూ ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. ఇలాంటి నేరాలకు పాల్పడున్న వారిని పోలీసులు పట్టుకుని ఎంత కఠినంగా శిక్షించినా కామాంధుల్లో మార్పు భయం కలగడం లేదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్‌లోకి గుర్తుతెలియని దుండగులు గురువారం రాత్రి 8 గంటల సమయంలో అక్రమంగా ప్రవేశించారు. బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న హాస్టల్ విద్యార్థినిపై హాస్టల్ ప్రాంగణంలో దారుణానికి ఒడిగట్టారు.


హాస్టల్‌లో అందరూ ఉండగానే యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు కామాంధులు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. తీవ్రగాయాలతో స్నేహితురాలు పడి ఉండడాన్ని గమనించిన తోటి విద్యార్థినిలు వసతిగృహం సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో బాధితురాలిని హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హాస్టల్ భవనంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులు ఎవరు, వారు ఏ విధంగా ప్రవేశించారు. వారికి ఎవరైనా సహాయం చేశారా? అనే పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Leopard: ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన చిరుత.. చివరికి ఏం జరిగిందంటే..

Gold and silver rates today: మహిళలకు బ్యాడ్ న్యూస్.. నేటి బంగారం, వెండి ధరలు ఇవే..

Updated Date - Jan 31 , 2025 | 09:00 AM