DGP Dwarka Tirumala Rao : గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీ
ABN , Publish Date - Jan 29 , 2025 | 05:18 AM
వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో పట్టుకున్న 35 వేల కిలోల డ్రై గంజాయిని మంగళవారం అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని రాంకీ కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్

ఏజెన్సీలో తగ్గిన సాగు.. ఒడిశా నుంచే రవాణా
ప్రతి జిల్లాలో సైబర్ పోలీసు స్టేషన్
డీజీపీ ద్వారకా తిరుమలరావు
పరవాడ, శ్రీకాకుళం క్రైం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ఏపీ ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. గంజాయి జోలికి ఎవరూ పోవద్దని, శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో పట్టుకున్న 35 వేల కిలోల డ్రై గంజాయిని మంగళవారం అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని రాంకీ కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులో యంత్రం ద్వారా శాస్త్రీయ పద్ధతిలో దహనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా, ఆ మూలాలు ఏపీలోనే ఉన్నాయన్న అప్రతిష్ఠను పోగొట్టేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. ఏపీ కంటే ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి నుంచి గంజాయి ఎక్కువగా రవాణా జరుగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్లలో సుమారు లక్ష కిలోల గంజాయి పట్టుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో సైబర్ నేరాల నియంత్రణకు ప్రతి జిల్లాలో సైబర్ క్రైం పోలీసుస్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ తెలిపారు.చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో నిందితులను శిక్షించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పా టు చేయాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మార్చి 31 నాటికి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మూడు యూట్యూబ్ చానళ్లపై కేసులు
తిరుపతి(నేరవిభాగం): టీటీడీ చైర్మన్, ఈవోపై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారంటూ వచ్చిన ఫిర్యాదుపై తిరుపతిలోని యూనివర్సిటీ పోలీసులు మంగళవారం మూడు యూట్యూబ్ చానళ్లపై కేసు నమోదు చేశారు. సీఐ రామయ్య కథనం మేరకు.. 15 రోజుల క్రితం ఆధ్యాత్మిక వేత్త, ప్రముఖ ఉపన్యాసకులు, ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తిరుమలకు వచ్చారు. ఆ సమయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఆయనకు ఏ మాత్రం గౌరవ మర్యాదలు ఇవ్వలేదని జర్నలిస్టు వైఎన్‌ఆర్, డయల్ న్యూస్, పోస్టు 360 చానళ్లు ప్రచారం చేశాయి. దీనిపై విచారణ చేసిన టీటీడీ ఉన్నతాధికారులు అదంతా పూర్తిగా అవాస్తవమని తేల్చారు.
For AndhraPradesh News And Telugu News