Home » Union Budget 2024-25
కేంద్ర బడ్జెట్ విపక్షాపూరితంగా ఉందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. విపక్షాలు 'దారుణమైన ఆరోపణలు' చేస్తున్నాయని విరుచుకుపడ్డారు.
కేంద్రపభుత్వం రూ.48,20,512 కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రైతులు, యువత, మహిళలు, పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించింది.
సార్వత్రిక ఎన్నికల తర్వాత జనగణన ఉంటుందని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ ప్రక్రియ మరింత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారంనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో జనగణన కోసం పరిమితంగానే కేటాయింపులు జరిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌పై బీజేడీ అధినేత, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ స్పందించారు. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రభుత్వం కొలువు తిరిన అనంతరం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై ఆయన పెదవి విరిచారు.
ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టడంలో.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీ(యూ) కీలకంగా వ్యవహరించాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై పశ్చిమబెంగాల్ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. దిశానిర్దేశం లేని, ప్రజావ్యతిరేక, రాజకీయ పక్షపాత బడ్జెట్ అని అభివర్ణించారు.
బీహార్ కు ప్రత్యేక హోదాపై కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రతిపాదన చేయకపోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. ప్రత్యేక హోదా కానీ, స్పెషల్ ప్యాకేజీ కానీ ఇవ్వాలని ఎన్డీయే నేతలకు తాను చెప్పానని, ఆ క్రమంలోనే బీహార్ అభివృద్ధికి పలు కీలక కేటాయింపులు ప్రకటించారని చెప్పారు.
కేంద్రం ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులపై ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోకసభలో ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్ పై కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. ఇది 'కాపీ-పేస్ట్' బడ్జెట్ అని అభివర్ణించింది.
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వరాలు ప్రకటించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.