Home » Uttar Pradesh
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న కారుకు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మృతుల్లో ఐదుగురు డాక్టర్లు ఉండటం విశేషం. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో మొఘల్ కాలం నాటి రాజ జామా మసీదు రీ సర్వేను స్థానిక ముస్లింలు వ్యతిరేకించారు. దీంతో పోలీసులు, స్థానిక ముస్లింలకు మధ్య ఘర్షణ ఏర్పడింది. ఆ తర్వాత ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకోవడంతో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో జీపీఎస్ నావిగేషన్ సాయంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అసంపూర్తిగా ఉన్న వంతెనపై నుంచి పడి మృత్యువాత పడ్డారు.
యూపీలోని కుందర్కి ఉప ఎన్నిక ఫలితాల్లో ఒకే ఒక హిందూ అభ్యర్థి 11 మంది ముస్లిం అభ్యర్థులపై పైచేయి సాధిస్తుండటం ఆసక్తికరంగా మారింది. మొత్తం 32 రౌండ్లలో 19 రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ రామ్‌వీర్ రామ్‌వీర్ ముందంజలో నిలిచారు.
ఉత్తరప్రదేశ్‌లోని 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, బీజేపీ, ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన ఆర్ఎల్డీ 7 స్థానాల్లో విజయపథంలోకి దూసుకుపోతోంది. తక్కిన 2 స్థానాల్లో సమాజ్‌వాదీ ఆధిక్యత చాటుకుంటోదని ఈసీ ట్రెండ్స్ వెల్లడించాయి.
ఎన్నికల స్వేచ్ఛగా, సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి, ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఫిర్యాదులు అందిన తక్షణమే చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో తెలియజేయాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు
పశ్చిమ ఉత్తప్రదేశ్‌లో వాతావరణ కాలుష్యం మంగళవారం పలుచోట్ల రోడ్డు ప్రమాదాలకు దారి తీసింది. దారి కానరాక కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు బైకర్లు అసువులు బాసారు. దీంతో, అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ప్రజలకు సూచనలు జారీ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో అతి పెద్ద ఆసుపత్రుల్లో ఒకటి.. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఝాన్సీ మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీ ఆసుపత్రి. నవంబర్ 15 అంటే.. శుక్రవారం రాత్రి ఈ ఆసుపత్రిలోని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో 11 మంది పసికందులు సజీవ దహనమయ్యారు.
నూతన వధూవరులు, కుటుంబ సభ్యులతో వస్తున్న వాహనం ఆకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో వధూవరులతో సహా ఏడుగురి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ రోడ్డు ప్రమాదం ఉత్తర్ ప్రదేశ్ బిజ్నోర్‌లో చోటుచేసుకుంది.
అనేక మంది పిల్లలు ఉన్న మెడికల్ కాలేజీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది చిన్నారులు మరణించారు. ఈ విషాధ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీలో చోటుచేసుకుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.