ధూళిపాళ్ల కేసులో ఏసీబీకి హైకోర్టులో చుక్కెదురు
ABN , First Publish Date - 2021-07-14T20:55:51+05:30 IST
ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ బెయిల్ రద్దు కేసులో ఏసీబీకి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది.

అమరావతి: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ బెయిల్ రద్దు కేసులో ఏసీబీకి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఏసీబీ అధికారులు వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. బెయిల్ రద్దు చేయడానికి తగిన కారణాలు కనిపించడంలేదని కోర్టు వ్యాఖ్యానిస్తూ.. పిటిషన్‌ను తిరస్కరించింది.
గతంలో సంగం డెయిలో పాలనాపరమైన అవకతవకలు జరిగాయంటూ కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సంగం ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, డెయిరీ ఎండీ గోపాల్ కృష్ణను అరెస్టు చేసింది. నెల రోజుల తర్వాత ఇద్దరికీ బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే.